Abhishek Sharma Net Worth : టీమిండియా యంగ్ స్టార్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటతో ప్రత్యర్థి జట్లకు దడపుట్టిస్తున్నాడు. అతని లగ్జరీ లైఫ్‌స్టైల్, ఫెరారీ, బీఎండబ్ల్యూ కార్లు, ఐపీఎల్ ఆదాయం, బ్రాండ్ డీల్స్‌తో కోట్ల సంపాదనతో ముందుకు సాగుతున్నాడు.
భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ తన ఆకట్టుకునే బ్యాటింగ్, అద్భుతమైన స్టైల్, లగ్జరీ లైఫ్‌స్టైల్‌తో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. క్రికెట్ మైదానంలో దూకుడైన ఇన్నింగ్స్‌లతో పాటు, సోషల్ మీడియాలో కూడా ఆయన ఫ్యాషన్ ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి.
2000 సెప్టెంబర్ 4న పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో జన్మించిన అభిషేక్, ప్రస్తుతం టీమిండియా భవిష్యత్ స్టార్‌గా గుర్తింపుపొందుతున్నారు. ఆయన క్రికెట్‌లో చేసిన ప్రదర్శనలు, ఆర్థికంగా అతని స్థాయిని గణనీయంగా పెంచాయి.
25
అభిషేక్ శర్మ కార్ల కలెక్షన్లలో ఫెరారీ, బీఎండబ్ల్యూ
అభిషేక్ శర్మకు ఆటతో పాటు లగ్జరీ కార్లపై కూడా ప్రత్యేక ఆసక్తి ఉంది. ఇటీవల ఆయన బ్లాక్, రెడ్ కలర్స్‌లో ఉన్న ఒక ఫెరారీ కారును కొనుగోలు చేశారు. రిపోర్టుల ప్రకారం, ఈ కార్ ధర ₹3 నుంచి ₹7 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఇక ఆయన గ్యారేజ్‌లో మరో ప్రీమియం కార్ BMW 320D కూడా ఉంది. దీని మార్కెట్ ధర సుమారు ₹83.96 లక్షలుగా ఉంది. ఈ కార్లు ఆయన రాయల్ లైఫ్‌స్టైల్‌కు సాక్ష్యాలుగా ఉన్నాయి.
35
అభిషేక్ శర్మ బీసీసీఐ, ఐపీఎల్ ఆదాయాలు
అభిషేక్ శర్మకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుండి సంవత్సరానికి ₹1 కోటి జీతం లభిస్తోంది. ప్రస్తుతం ఆయన గ్రేడ్ C కేటగిరీలో ఉన్నారు. ఐపీఎల్ లో ఆయనను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ₹14 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్ కెరీర్ ద్వారా ఆయన మొత్తం ₹35.7 కోట్లు సంపాదించారు. క్లబ్ క్రికెట్, బీసీసీఐ కాంట్రాక్ట్‌లు, స్పాన్సర్ డీల్స్.. ఇవన్నీ కలిసి ఆయన ఆదాయ వనరులను మరింత బలోపేతం చేస్తున్నాయి.
క్రికెట్ ప్రదర్శనతో పాటు, బ్రాండ్ ప్రమోషన్లలో కూడా అభిషేక్ శర్మ విజయవంతమైన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. Garnier Men, Arbano Fashion, Sareen Sports వంటి బ్రాండ్లకు బ్రాండ్ అంబాసడర్‌గా ఉన్నారు.
ఈ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ఆయన ప్రతి ఏడాది ₹7 నుంచి ₹8 లక్షల వరకు సంపాదిస్తున్నారని సమాచారం.
ఆయన మొత్తం నెట్‌వర్త్ ₹15 కోట్లకు చేరుకుందని అంచనా. ఈ యంగ్ ప్లేయర్ క్రికెట్ లో స్టార్ గా ఎదుగుతూనే సంపాదనలో కూడా దూసుకుపోతున్నారు.
55
అభిషేక్ శర్మ టీ20 ఇంటర్నేషనల్ కెరీర్ రికార్డులు
అభిషేక్ శర్మ ఇప్పటివరకు తన T20I కెరీర్‌లో 26 మ్యాచ్‌లను ఆడారు. ఈ మ్యాచ్‌లలో 25 ఇన్నింగ్స్‌లలో 936 పరుగులు సాధించారు.
ఆయన 193.39 స్ట్రైక్‌రేట్తో తన ఆటను కొనసాగించారు. ఇప్పటికే రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు కొట్టారు. ఈ గణాంకాలు ఆయన బ్యాటింగ్ దూకుడు ఏ స్థాయిలో ఉందో సూచిస్తున్నాయి. భారత క్రికెట్‌లో వచ్చే ఏళ్లలో అభిషేక్ శర్మ సూపర్ స్టార్ గా ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.