వినాయక చవితి రోజున ఏం చేస్తే.. ఆ గణపయ్య కృప లభిస్తుందో తెలుసా?

Published : Aug 26, 2025, 11:07 AM IST

ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీన బుధవారం ప్రపంచ వ్యాప్తంగా వినాయక చతుర్థి ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఉత్తర భారత దేశంలో ఈ గణేష్ చతుర్థి వేడుకలు దాదాపు 10 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు.

PREV
14
వినాయక చవితి

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండగలలో వినాయక చవితి ఒకటి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో ఈ పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీన బుధవారం ప్రపంచ వ్యాప్తంగా వినాయక చతుర్థి ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఉత్తర భారత దేశంలో ఈ గణేష్ చతుర్థి వేడుకలు దాదాపు 10 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. అయితే.. ఇంట్లో పది రోజుల పాటు వినాయకుడి ప్రతిమను ఉంచి పూ చేసుకోవడం కుదరదు. దాదాపు అందరూ ఒక్కరోజు మాత్రమే ఉంచుకుంటారు. మరి.. ఈ రోజున పూజ ఎలా చేస్తే.. గణేశుని పూర్తి ఆశీస్సులు పొందుతారు? పూజా విధానం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

24
వినాయక చవితికి ఎలా సిద్ధం కావాలి?

మీరు ఇంట్లో వినాయక చవితి జరుపుకోవాలి అనుకుంటే, ముందు రోజు ఇంట్లోని అన్ని గదులను శుభ్రం చేయాలి. ముఖ్యంగా పూజ గదులను శుభ్రం చేసిన తర్వాత భగవంతుని ఫోటోలను తుడిచి, చందనం, కుంకుమ ఉంచండి. ఆగస్టు 27వ తేదీ శుభ సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.40 గంటల మధ్య ఉంటుంది. కాబట్టి, మీకు సమయం దొరికినప్పుడల్లా పూజలు చేయడం మంచిది. గణేశ్ చతుర్థి పూజకు ఇది శుభ సమయం.

34
మట్టి వినాయకుడు

వినాయక చతుర్థి సమయంలో గణేశుడి విగ్రహాన్ని పూజించడం ఆచారం. ఇప్పుడు వివిధ గ్రహాలు అందుబాటులో ఉన్నప్పటికీ, మట్టితో చేసిన విగ్రహాలతో మాత్రమే పూజ చేయాలి.అన్ని పూజలు ముగిసిన తర్వాత మనం విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. ఈ విధంగా, అన్ని దుఖాలు తొలగిపోతాయి అని నమ్ముతారు.

44
21 రకాల ఆకులు..

పూజ గదిలో మట్టి విగ్రహాన్ని పూజించేటప్పుడు.. గంధం,కుంకుమ వేయాలి. గణపయ్య ఉదరంపై ఒక నాణెం ఉంచాలి.మీకు అందుబాటులో ఉన్న పూలు తెచ్చి ఆ గణపయ్యను అలంకరించి.. భక్తితో పూజించాలి. 21 రకాల ఆకులతో కూడా పూజించాలి. ఇక.. గణపయ్యకు నచ్చిన నైవేద్యాలను వినాయకుడికి సమర్పించాలి.

Read more Photos on
click me!

Recommended Stories