వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఈ మొక్క ఇంట్లో నాటితే ఆనందం, శ్రేయస్సు, సంపద కలుగుతుందని నమ్ముతారు. ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం వల్ల ఆ వ్యక్తి ధనవంతుడు అవుతాడని, ఆ ఇంట్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయని, ఆర్థిక లాభాలు వచ్చి పడతాయని అంటారు. ఈ నమ్మకం పురాతన కాలం నుంచి ఉంది. అయితే కొంతమంది ఈ మొక్కను వేరొకరి ఇంటి నుంచి వారికి తెలియకుండా కొమ్మని తెచ్చి ఇంట్లో నాటుతారు. దీన్ని దొంగతనమనే అంటారు. అలా చేస్తే పక్కింటి వారి సంపద తమకు వచ్చేస్తుందని వారు భావిస్తారు. అది ఎంతవరకు నిజమో ఇప్పుడు చూద్దాం.