కార్తీక మాసంలో ఈ ఒక్క రోజు ఉపవాసం చేసినా చాలు... కోటి జన్మల పుణ్యం దక్కినట్లే..!

Published : Oct 29, 2025, 03:34 PM IST

Koti Somavaram:  కార్తీక మాసంలో   కోటి సోమవారాన్ని అత్యంత పుణ్య తేదీగా పరిగణిస్తారు. ఈ రోజున ఏం చేయాలి?  ఉపవాసం ఎందుకు చేయాలి?  ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి?

PREV
15
కోటి సోమవారం

హిందూ పురాణాల ప్రకారం కార్తీక మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నెలను పరమ శివుడికి కేటాయించారు. అయినప్పటికీ, శివ, కేశువుల ఇద్దరికీ ప్రత్యేక పూజలు చేస్తారు. కాగా, ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఎలాంటి ప్రాముఖ్యత ఉందో... కోటి సోమవారానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది కోటి సోమవారం... అక్టోబర్ 30వ తేదీన వచ్చింది.

25
కోటి సోమవారం ప్రాముఖ్యత....

వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం, కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రంతో కలిసి వచ్చిన సోమవారాన్నే కోటి సోమవారం అని పిలుస్తారు. ఈ రోజున ఏ పుణ్య కార్యం చేసినా.. కోటింతల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ రోజున ఉపవాసం, దాన ధర్మాలు లాంటివి చేయాలని నమ్ముతారు.

35
కోటి సోమవారం రోజున ఉపవాసం ఎందుకు చేయాలి...?

కోటి సోమవారం రోజున ఉపవాసం చేయడం ద్వారా, ఆత్మ శుద్ధి చెందుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. పురాణాల ప్రకారం, ఈ ఒక్క సోమవారం ఉపవాసం ఉన్నా... కోటి సోమవారాలు ఉపవాసం చేసినంత సమానంగా భావిస్తారు. ఇక.. ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. శరీరంలోని మలినాలు తొలగిపోవడమే కాదు, భక్తి భావం పెరుగుతుంది. చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.

45
ఈ రోజున ఉపవాసం ఎలా చేయాలి...?

ఉదయం త్వరగా లేచి స్నానం:

సూర్యోదయానికి ముందే నదిలో లేదా గృహంలో పవిత్ర స్నానం చేయాలి. ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువు నదులలో, చెరువులలో నివసిస్తాడని నమ్మకం ఉంది. శివాలయానికి వెళ్లి పంచామృతాలతో శివలింగాభిషేకం చేయాలి. బిల్వ పత్రాలు సమర్పించడం మంచిది. మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధాన చేయాలి. ఈ రోజున విష్ణు ఆలయానికి వెళ్లి.. తులసి మాలను సమర్పించడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు.

55
ఉపవాస నియమం:

సాధ్యమైనంతవరకు ఉదయం నుంచి రాత్రి వరకు ఆహారం తీసుకోకూడదు. రాత్రి నక్షత్ర దర్శనం చేసిన అనంతరం మాత్రమే భోజనం చేయాలి. దాన ధర్మాలు చేయడం మంచిది. పేదలకు ఆహారం, వస్త్రాలు, డబ్బు లేదా ఇతర అవసరమైన వస్తువులు దానం చేయడం వల్ల ఉపవాస ఫలం పెరుగుతుందని నమ్ముతారు.

ఈ రోజున ఉసిరి చెట్టు కింద పూజ చేసి, కుటుంబ సభ్యులతో కలిసి కార్తీక వనభోజనం చేయడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం ద్వారా ఐశ్వర్యం, సుఖసంతోషాలు, సంతానాభివృద్ధి కలుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories