అసలు గుడిలో గంటను ఎందుకు కొడతారో తెలుసా?

First Published | Mar 5, 2024, 10:49 AM IST

మనలో ప్రతి ఒక్కరూ గుళ్లలో గంటలు కొట్టే ఉంటారు. గుడికి వెళ్లిన వెంటనే గంట కొట్టి దండం పెడతారు. అలాగే గుడి నుంచి బయటకు వెచ్చేటప్పుడు కూడా కొంతమంది గంట కొడుతుంటారు. కానీ గుడిలో గంటను ఎందుకు కొడతారు? తిరిగి వచ్చేటప్పుడు గంట కొడితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Bell

హిందూ మతంలో.. గుడికి సంబంధించిన ఎన్నో విషయాలను నమ్ముతారు. నేటికీ కూడా ఈ నియమాలను, నమ్మకాలను పాటించేవారు చాలా మందే ఉన్నారు. వీటిలో ఒకటి గుడిలో గంట కొట్టడం. ఏ దేవుడి గుడైనా సరే ఖచ్చితంగా గంట అయితే ఉంటుంది. ఇక గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ గంటను మోగిస్తారు. గుడిలోకి వెళ్లిన వెంటనే గంట కొట్టి దేవుడికి దండం పెడతారు. అలాగే పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే ముందు కూడా గంటను కొడతారు. కానీ నియమాల ప్రకారం.. గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం గంట కొట్టకూడదు. ఇలా ఎందుకు చేయకూడదో మాత్రం చాలా మందికి తెలియకూడదు. అందుకే దీని గురించి ఈ రోజు తెలుసుకుందాం పదండి. 
 

Bell

గుడిలోకి వెళ్లేటప్పుడు గంట ఎందుకు కొడతారు? 

హిందూ మత విశ్వాసాల ప్రకారం.. గుడిలోకి వెళ్లేటప్పుడు గంట కొడితే ఆ శబ్దంతో మన శరీరంలోని అన్ని రకాల ప్రతికూల శక్తులు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెప్తారు. శరీరం నుంచి అన్ని రకాల ప్రతికూల శక్తులు తొలగిపోయినప్పుడు మనం ఏకాగ్రతతో దేవుడిని పూజిస్తారు. అంతేకాకుండా గంట శబ్దం దేవుడికి ఎంతో ప్రీతికరమైంది. అలాగే గంట కొట్టడం వల్ల భక్తులు గుడిలోకి వెళ్లడానికి దేవుడి అనుమతి కోరి, తర్వాత పూజిస్తారు. గంట శబ్దం శరీరం, చుట్టుపక్కల వాతావరణంలోకి సానుకూల శక్తి ప్రవహించడానికి కూడా సహాయపడుతుంది. 
 


Bell

తిరిగి వెళ్లేటప్పుడు గంట ఎందుకు కొడతారు? 

గుడికి వెళ్లనప్పుడు మన మనస్సులో ఎన్నో జరుగుతుంటారు. అలాగే నెగిటివ్ ఆలోచనలు కూడా వస్తూనే ఉంటాయి. గుడిలోకి వెళ్లేటప్పుడు గంట కొట్టగానే అది తొలగిపోతుంది. శంఖం, గంటల దివ్య శబ్దం మన శరీరంలోని ప్రతికూల శక్తిని, ఆలోచనను తొలగిస్తుంది. అప్పుడు గుళ్లో ఉన్న దేవతను చూడగానే మనసులో పాజిటివ్ ఎనర్జీ, ఆలోచనలు మొదలవుతాయి. ఆ తర్వాత ప్రేమతో, భక్తితో తిరిగి వెళ్లేటప్పుడు మళ్లీ గంట మోగిస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ గంట శబ్దంతో అయోమయానికి గురై మీలో నుంచి పోతుంది. కాబట్టి పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవాలంటే ఆలయం నుంచి తిరిగి వచ్చేటపుడు గంట మోగించకూడదు.
 

temple bell

ఆలయంలో గంట ప్రాముఖ్యత 

సృష్టి ప్రారంభమైనప్పుడు ప్రతిధ్వనించిన శబ్దం‘ గంట శబ్దం’ అని నమ్ముతారు. ఓంకారం మాటలతో ఈ స్వరం కూడా మేల్కొంటుంది. అంతేకాకుండా గంట మోగించడం వల్ల ఓంకారం మంత్రాన్ని పఠించే పుణ్యం లభిస్తుందని కూడా చెప్తారు. మత విశ్వాసాల ప్రకారం.. గంట మోగించడం విగ్రహాలలో చైతన్యాన్ని మేల్కొల్పుతుంది. 
 

Latest Videos

click me!