మహాశివరాత్రి ఉపవాసం ఉండేవారు ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?

First Published | Mar 3, 2024, 9:40 AM IST

Mahashivratri 2024: ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షం నాల్గో రోజున మహా శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి 8వ శుక్రవారం వచ్చింది. అయితే ఈ పవిత్రమైన రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. అయితే వీళ్లు కొన్ని ఆహారాలను అసలే తినకూడదు. ఒకవేళ తింటే ఉపవాసం ఫలం కూడా దక్కదు. 
 

mahashivratri 2024

సనాతన ధర్మంలో మహాశివరాత్రి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ప్రతి ఏడాది మహాశివరాత్రి పండుగను ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం నాల్గో రోజున మహా శివరాత్రి జరుపుకుంటాం. ఈ ఏడాది మహాశివరాత్రిని మార్చి 8న న వచ్చింది. ఈ రోజున శివ పార్వతులు వివాహం చేసుకున్నారని ప్రతీతి. అందుకే ఈ రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శివభక్తులు శివుడు, పార్వతిలను పూజిస్తారు. ఉపవాసం ఉంటారు. మీరు కూడా మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటట్టైతే .. ఉపవాసానికి ముందు, అప్పుడు ఏవి తినాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. 
 

శివరాత్రి నాడు ఏం తినాలి? 

మహాశివరాత్రి నాడు ఉదయాన్నే స్నానమాచరించి శుభ్రమైన బట్టలు వేసుకుని శివపార్వతులను పూజించాలి. ఆ తర్వాత ఉపవాసం ఉండాలి. మహాశివరాత్రి ఉపవాసం సమయంలో నారింజ, అరటి, ఆపిల్ వంటి పండ్లను తినొచ్చు. వీటితో పాటుగా మహాశివరాత్రి నాడు సాయంత్రం సింఘారా హల్వా, సాబుదానా కిచిడీని తినొచ్చు. అలాగే కొబ్బరినీళ్లు, రైస్ ఖీర్ ను కూడా తీసుకోవచ్చు. 
 


శివరాత్రి నాడు ఏం తినకూడదు? 

మహాశివరాత్రి ఉపవాసం సమయంలో వెల్లుల్లి, ఉల్లిపాయలను తినడం నిషిద్ధం. ఈ రోజున రాతి ఉప్పును ఉపయోగించాలి. అలాగే మాంసం, ఆల్కహాల్ కు కూడా దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఉపవాస సమయంలో చిరుధాన్యాలు, బియ్యం, గోధుమలు, బార్లీ తినడం కూడా నిషిద్ధమే.
 

మహాశివరాత్రి తేదీ, ముహూర్తం

పంచాంగం ప్రకారం.. ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి తేదీ  మార్చి 8 న రాత్రి 09:57 గంటలకు శివరాత్రి ప్రారంభమవుతుంది. అలాగే  మార్చి 09 సాయంత్రం 06:17 గంటలకు ముగుస్తుంది. అందుకే శివరాత్రిని మార్చి 8 న జరుపుకుంటారు. 

Latest Videos

click me!