మహాశివరాత్రి నాడు వీటిని దానం చేస్తే ప్రతి పనిలో విజయం మీ సొంతం

First Published | Feb 28, 2024, 11:49 AM IST

Mahashivratri 2024: ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం నాల్గో రోజున మహా శివరాత్రి పండుగను జరుపుకుంటాం. ఈ మహాశివరాత్రి నాడు కొన్ని వస్తువులను దానం చేస్తే ప్రతి పనిలో విజయం సాధిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటంటే? 

Mahashivratri 2023

మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన పండుగ.  ఈ పండుగను ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది శివరాత్రిని మార్చి 8 న జరుపుకోబోతున్నాం. ఈ పండుగ రోజు శివపార్వతులను నిష్టగా పూజిస్తారు. అలాగే ఉపవాసం కూడా ఉంటారు. మహాశివరాత్రి ఉపవాసం ఉండి శివపార్వతులను పూజించడం వల్ల భక్తులు సుఖసంతోషాలతో వర్ధిల్లుతారనే నమ్మకం ఉంది. శివుని పూజతో పాటుగా మహాశివరాత్రి రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల కూడా పుణ్యఫలాలను పొందుతారు. దానాన్ని మన జీవితంలో నిస్వార్థంగా చేయాలి. మహాశివరాత్రి పర్వదినా ఏయే వస్తువులను దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

black sesame

- మహాశివరాత్రి పర్వదినాన మీరు నువ్వులను దానం చేయండి. నువ్వులను దానం చేయడం వల్ల వంశపారంపర్యంగా వస్తున్న దోషాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది. అలాగే పితృస్వరూపులు శాంతిస్తారని నమ్ముతారు. అలాగే ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.


milk

- వీటితో పాటుగా పాలను, ఇతర పాల ఉత్పత్తులను కూడా దానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం మీకు లభిస్తుంది. 

- మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పేదలకు దుస్తులు దానం చేయండి. దీనివల్ల మీ ఇళ్లు సంతోషంగా ఉంటుంది. అలాగే మీకు ధనప్రయోజనం కూడా లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

shivratri

- మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలనుకుంటే మహాశివరాత్రి నాడు శివాలయానికి వెండి శివలింగాన్ని దానం చేయండి. వెండి శివలింగాన్ని దానం చేయడం వల్ల సాధకుడు కోరుకున్న ఫలాన్ని పొందుతాడు.
 

మహాశివరాత్రి శుభ ముహూర్తం

హిందూ క్యాలెండర్ ప్రకారం..  ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిథి మార్చి 8న రాత్రి 09:57 గంటలకు ప్రారంభమయ్యి మార్చి 09 సాయంత్రం 06:17 గంటలకు ముగుస్తుంది. అందుకే మార్చి 8న మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు.

Latest Videos

click me!