ఏదైనా పని విషయంలో బయటకు వెళ్లే సమయంలో ముగ్గురు కలిసి వెళ్లకూడదని పెద్దలు చెబుతుంటారు. హిందూ మతంలో ఈ సంఖ్యను అశుభమైందిగా పరిగణిస్తారు. వ్యక్తుల విషయంలోనే కాదు. ప్లేట్‌లో మూడు చపాతీలు వేసుకోవడం, పూజ సమయంలో ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకే చోట కూర్చోవడం వంటివన్నీ అశుభంగా పరిగణిస్తారు. ఇంతకీ పెద్దలు 3 సంఖ్యను అశుభంగా భావించడంలో నిజంగానే నిజం ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం 3 సంఖ్య అశుభం కాదని చెబుతున్నారు. నిజానికి సృష్టి అనేది మూడు ప్రాథమిక స్తంభాలపై ఆధారపడి ఉంటుందని అంటారు. త్రిమూర్తులకు 3 సింబాలిక్‌గా చెబుతుంటారు. పరిక్రమ ప్రధాన సంఖ్య కూడా 3. ముల్లోకాలను ఏలే శివుడి త్రిశూలం కూడా 3 భాగాలుగా విభజించి ఉంటుంది. 3 గ్రహాలు ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. అంతెందుకు వివాహంలో మూడు మూళ్ల బంధంతోనే జంటలు ఒక్కటవుతారు.
గంగా, యమున, సరస్వతి నదులు మూడు కలిసే చోటును కూడా కోట్లాది మంది శుభంగా పరిగణిస్తారు. అందుకే మూడు నెంబర్‌ను నెగిటివ్‌గా భావించకూడదని నిపుణులు చెబుతున్నారు. అందుకే 3 నెగిటివిటికీ సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించకపోవడమే ఉత్తమం.