Karthika Masam: కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన వాటిలో దీపారాధన ముందు వరసలో ఉంటుంది. కొందరు పౌర్ణమి వేళ దీపారాధన చేస్తే.. మరి కొందరు నెల రోజులు వెలిగిస్తారు. అంతేకాకుండా.. తులసి కోట వద్ద, దేవాలయాల్లో, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తూ ఉంటారు.
హిందూ పంచాంగం ప్రకారం దీపావళి పండగ తర్వాత కార్తీక మాసం ప్రారంభమౌతుంది. అత్యంత పవిత్రమైన మాసంగా ఈ కార్తీక మాసాన్ని పరిగణిస్తారు. ఈ సంవత్సరం కార్తీక మాసం అక్టోబర్ 22వ తేదీన మొదలై.. నవంబర్ 20వ తేదీ వరకు కొనసాగనుతంది. ఈ నెల రోజులు భక్తులు ఆ శివయ్యను మనసారా పూజిస్తారు. శివాలయాలన్నీ.. శివనామస్మరణతో మారుమోగిపోతాయి. ఉపవాసాలు, ప్రత్యేక పూజలు చాలా ఎక్కువగా చేసే ఈ కార్తీక మాసంలో తులసి పూజకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ కార్తీక మాసంలో శివయ్య తోపాటు విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. వీరిని మనస్ఫూర్తిగా, భక్తి శ్రద్ధలతో పూజించినా, కార్తీక స్నానాలు ఆచరించినా.. చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని కూడా నమ్ముతారు.
24
దీపారాధన...
కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన వాటిలో దీపారాధన ముందు వరసలో ఉంటుంది. కొందరు పౌర్ణమి వేళ దీపారాధన చేస్తే.. మరి కొందరు నెల రోజులు వెలిగిస్తారు. అంతేకాకుండా.. తులసి కోట వద్ద, దేవాలయాల్లో, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తూ ఉంటారు. నెయ్యి లేదా, నువ్వుల నూనెతో ఈ దీపారాధన చేయడం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. కార్తీక మాసంలో నదీ స్నానానికి కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సూర్యోదయం కంటే ముందే నదీ స్నానం ఆచరించి.. ఆ తర్వాత దీపారాధన చేయడం మంచిదని నమ్ముతారు.
34
తులసి పూజ ప్రాధాన్యత...
కార్తీక మాసంలో ప్రతి సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. ఈ దీపం ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది. ఆర్థిక సౌభాగ్యాన్ని పెంచుతుంది, ప్రతికూల శక్తులను తొలగిస్తుంది.
కార్తీక మాసంలో తులసిపూజ చేయడం ఎంత ముఖ్యమూ... ఏ సమయంలో చేస్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. ఉదయం తెల్లవారుజామున.. సూర్యోదయం రాకముందే చేయాలి. లేదంటే... సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చేయాలి. అది కూడా ఈశాన్య దిశలో వెలిగించాలి. ఆ దీపారాధన చేసే సమయంలో ‘ శుభం కరోతి కల్యాణం, ఆరోగ్యం ధనసంపద, శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్ నమోస్తుతే’ అనే మంత్రం జపించాలి.