Garuda Purana: తప్పు చేయక్కర్లేదు... ఇతరులపై నిందలు వేసినా శిక్ష తప్పదు, ఈ కథ చదివితే చాలు..!

Published : Oct 06, 2025, 01:38 PM IST

Garuda Purana: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఇతరులపై నిందలు వేస్తూ ఉంటారు. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు.కానీ, గరుడ పురాణం ప్రకారం ఇలా చేస్తే  శిక్ష తప్పదు.

PREV
14
Garuda Purana

మనం చేసిన తప్పులకు మరణానంతరం కూడా శిక్షలు అనుభవించాల్సి వస్తుందని గరుడ పురాణం చెబుతుంది. అయితే.. చాలా మంది దొంగతనాలు, హత్యలు లాంటివే పెద్ద పెద్ద తప్పులని.. వాటికి మాత్రమే శిక్ష పడుతుందని అనుకుంటారు. కానీ.... ఏ తప్పు చేయకపోయినా, కేవలం ఇతరులపై నిందలు వేసినా కూడా కచ్చితంగా శిక్షలు పడతాయని మీకు తెలుసా? ఇది అర్థం అవ్వాలంటే.. ఈ కింది కథ మీరు చదవాల్సిందే...

24
రాజు కథ

పూర్వం ఒక రాజు ఎంతో భక్తిశ్రద్ధలతో జీవించేవాడు. అతనికి చాలా సంవత్సరాల తర్వాత సంతానం కలిగింది. చాలా కాలం తర్వాత బిడ్డ పుట్టడంతో ఆనందంలో ఆ రాజు తన రాజ్యంలో పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశాడు. రాజ్యంలోని ప్రజలంతా ఆ భోజనానికి వచ్చారు. అన్ని రకాల వంటలతో వారికి భోజనం ఏర్పాటు చేశారు.

అయితే... వారంతా ఓపెన్ ఏరియాలో భోజనం చేస్తున్న సమయంలో ఆకాశంలో ఒక గ్రద్ద ఎగురుతూ వెళ్తోంది. ఆ గ్రద్ద నోట్లో ఓ పాము కూడా ఉంది. ఆ పాము నోట్లో ఉన్న కొంత విషయం కింద... భోజనం చేస్తున్న ఒక మనిషి తింటున్న ఆహారంలో పడింది. ఆ వ్యక్తి చూసుకోకుండా.. ఆ భోజనం తినేశాడు. తిన్న కాసేపటికే ఆ వ్యక్తి చనిపోయాడు.

ఆ వ్యక్తి చనిపోవడంతో రాజుతో పాటు రాజ్యంలోని ప్రజలంతా కూడా షాక్ అయ్యారు. అయితే... ఆ వ్యక్తి చావుకు కారణం ఎవరు అని అందరూ ఆలోచించారు. ఈ విషయంపై యమలోకంలోనూ చర్చకు దారి తీసింది. ఆ వ్యక్తి చనిపోవడానికి కారణం పాము, గ్రద్ద, రాజు, లేక భోజనం తిన్న వ్యక్తేనా? ఎవరి మీద ఈ నేరం వేయాలి అని యమ ధర్మరాజుకు కూడా అర్థం కాలేద. వీరిలో ఎవరి ఉద్దేశం దుర్భుద్ధితో కూడినది కాదని.. యమధర్మరాజు ఆ పాపాన్ని ఎవరి మీదా వేయలేదు.

34
నిందలు వేస్తే...

కొన్ని నెలల తర్వాత, పక్క రాజ్యం నుంచి కొందరు వ్యాపారులు ఆ రాజును కలవడానికి వస్తున్నారు. మార్గమధ్యంలో ఒక పండ్ల వ్యాపారి వారిని ఆపి, “మా రాజుగారి దగ్గర జాగ్రత్త… ఆయన పెట్టిన భోజనం తింటే చచ్చిపోతారు!” అని చెప్పాడు. అతనికి తెలిసినది కేవలం రూమర్ మాత్రమే. నిజానికి అతడు ఆ సంఘటన వెనుక కారణం ఏంటో తెలియదు. కానీ తన మాటతో ఆ రాజు గురించి చెడు భావన కలిగించాడు.

అది తెలుసుకున్న యమధర్మరాజు వెంటనే తీర్పు ఇచ్చాడు —

“ఆ పాపం ఇప్పుడు ఈ పండ్ల వ్యాపారికే చెందుతుంది.” ఎందుకంటే, మరణానికి కారణమైనది విషం కాదు, ఇప్పుడు వ్యాపించిన తప్పుడు నింద.

దానివల్ల నిర్దోషి రాజు పేరు చెడిపోయింది, ఇతరుల మనసుల్లో అనవసర భయం కలిగింది. అని ఆ వ్యక్తి మరణానికి పండ్ల వ్యాపారి కారణం అని తీర్పు ఇచ్చాడు.

ఈ కథ మన జీవితానికి ఒక అద్దం లాంటిది.

44
గరుడ పురాణం ఏం చెబుతోంది అంటే..

మన చుట్టూ జరుగుతున్న ప్రతి విషయానికి మనం తక్షణమే తీర్పు ఇస్తాం."అతడే తప్పు చేశాడు", “ఇవాళ ఆమే వల్ల ఇలా జరిగింది” అని నిర్ధారణ చేసేసుకుంటాం. కానీ వాస్తవం మనకు తెలియదు. నింద వేయడం అంటే, మనకే పాపం తెచ్చుకోవడం. ఎందుకంటే అది వాస్తవాన్ని వక్రీకరిస్తుంది. అది ఎవరో ఒకరి గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని నాశనం చేస్తుంది.

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఇతరులపై నిందలు వేస్తూ ఉంటారు. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా భవిష్యత్తులో మీరే సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. అందుకే.. ఇతరులపై నిందలు వేయకూడదు.

Read more Photos on
click me!

Recommended Stories