Vidhura Niti: వీరికి మాత్రం పొరపాటున కూడా డబ్బులు ఇవ్వకూడదు, ఎందుకో తెలుసా?

Published : Apr 18, 2025, 04:14 PM IST

విదురుడు ఎప్పుడూ ధర్మాన్ని మాత్రమే పాటించేవాడు. అధర్మాన్ని వ్యతిరేకించేవాడు. ఆయన మన జీవితానికి ఉపయోగపడే చాలా రకాల విషయాలను వివరించారు. వాటిలో ఆయన ప్రకారం.. కొందరికి పొరపాటున డబ్బులు ఇవ్వకూడదట.

PREV
15
Vidhura Niti: వీరికి మాత్రం పొరపాటున కూడా డబ్బులు ఇవ్వకూడదు, ఎందుకో తెలుసా?

మహాభారతంలో చాలా ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. వాటిలో విదురుడు ఒకరు. విదురుడు యుముడి అవతారం. ధృతరాష్ట్రుడికి తమ్ముడు. హస్తినాపురం మంత్రి కూడా. విదురుడు ఎప్పుడూ ధర్మాన్ని మాత్రమే పాటించేవాడు. అధర్మాన్ని వ్యతిరేకించేవాడు. ఆయన మన జీవితానికి ఉపయోగపడే చాలా రకాల విషయాలను వివరించారు. వాటిలో ఆయన ప్రకారం.. కొందరికి పొరపాటున డబ్బులు ఇవ్వకూడదట.మరి, ఎలాంటి వారికి ఇవ్వకూడదో తెలుసుకుందాం..

25


సోమరిపోతులకి డబ్బులు ఇవ్వకూడదు..

విధుర నీతి ప్రకారం సోమరిపోతులకి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. వాళ్ళు ఆ డబ్బుని వృధా చేస్తారు. వాళ్ళ పనుల కోసం ఇతరుల మీద ఆధారపడతారు. వాళ్ళకి డబ్బులిస్తే వృధా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం ఉండదు. అందుకని వాళ్ళు డబ్బులు తిరిగి ఇస్తారని ఆశించకూడదు.

లోభిలకి డబ్బులివ్వకండి
లోభిలకి కూడా డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వడంలో నమ్మకం ఉండదు. వాళ్ళు ఎప్పుడూ ఇతరుల డబ్బుని కాజేయాలని చూస్తూ ఉంటారు. అందుకని వాళ్ళ మీద డబ్బు విషయంలో నమ్మకం పెట్టుకోకూడదు. లేకపోతే మీరే బాధపడాల్సి వస్తుంది.

35

నమ్మకం లేని వాళ్ళకి డబ్బులివ్వకండి

డబ్బుల విషయంలో అందరినీ నమ్మి మోసం చేసే వారికి పొరపాటున కూడా మీరు అప్పు ఇవ్వకూడదు.అందరినీ మోసం చేసేవారు మిమ్మల్ని కూడా మోసం చేసే అవకాశం ఉంది.వాళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాత కనిపించరు. డబ్బులు అడిగితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. అందుకని వాళ్ళకి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు.
 

45

దుర్వినియోగం చేసే వాళ్లకు డబ్బులు ఇవ్వకూడదు
వాళ్లు డబ్బుని సరిగ్గా వాడరు, వృథా చేస్తారు. మద్యం, ఆటలు వంటి అలవాట్లకు డబ్బుని ఖర్చు చేస్తారు. ఇటువంటి వాళ్లకి అప్పు ఇస్తేఆ డబ్బు తిరిగి రాదు.

 ధనాన్ని గౌరవించని వారికి అప్పు ఇవ్వకూడదు
పని చేయకుండా, ఎప్పుడూ శ్రమించకుండా సంపద రావాలని అనుకునే వాళ్లకు డబ్బు విలువ తెలీదు. అలాంటి వారికి మీరు డబ్బు ఇస్తే.. తిరిగి ఇస్తారనే నమ్మకం ఉండదు.మీరు ఇవచ్చిన డబ్బును కూడా వీరు మంచికి ఉపయోగించరు.
 

55

తిరిగి ఇవ్వగల సామర్థ్యం లేని వారికి అప్పు వద్దు
వాళ్లు మనసున్నవాళ్లు కావచ్చు కానీ వాళ్లకి ఆదాయం లేకపోతే తిరిగి ఇవ్వలేరు.అలాంటి వాళ్లకు ఇవ్వడం వల్ల మనకే నష్టం కలుగుతుంది.
విదురుడు చెప్పినట్టు, మన దయ వల్ల వారికి అప్పు ఇవ్వడం కాకుండా, చేతనంత సహాయం మీరు చేస్తే చాలు.

విదురుడు ఏమన్నారంటే...

“ఎవరైనా ధనాన్ని సంపాదించాలంటే ధర్మబద్ధంగా, శ్రమతో, జాగ్రత్తగా ఉపయోగించాలి. ధనాన్ని అర్హులకే ఇవ్వాలి. లేకపోతే అది మనకే సమస్యను తెస్తుంది.”
 

Read more Photos on
click me!

Recommended Stories