Published : Apr 17, 2025, 10:08 AM ISTUpdated : Apr 17, 2025, 10:15 AM IST
calender vastu: సాధారణంగా అయితే క్యాలెండర్ అంటే తేదీలు చూపించే ఒక కాలమానిని. కానీ జ్యోతిష్యం, వాస్తు నమ్మేవాళ్లకు అది వారాలు, వర్జ్యాలు, నమ్మకాల సాధనం. అయితే దీంతోపాటు మనం క్యాలెండర్ వేలాడదీసే దిశ కూడా మన దశను మారుస్తుంది అంటుంటారు జ్యోతిషనిపుణులు.
మనం ఇంటిని కట్టుకునేటప్పుడు వాస్తుని తప్పకుండా పాటిస్తాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంట్లో క్యాలెండర్ ని వేలాడదీశే విషయంలోనూ అంతే పక్కాాగా ఉండాలంటారు వాస్తు, జ్యోతిష నిపుణులు. అలా చేసినప్పుడే అద్రుష్టం కలిసి వస్తుందంటారు. అప్పుడు పాటించని చిన్నచిన్న పొరపాట్లే జీవితాంతం ప్రభావం చూపిస్తాయంటారు. అందుకే క్యాలెండర్ కి దేవుడి పటాలకు ఇచ్చేంత ప్రాధాన్యం ఇవ్వాలి.
23
క్యాలెండర్‌ను ఎల్లవేళలా తూర్పు లేదా ఉత్తరం దిక్కుకు వేలాడదీయాలి. ముఖ్యంగా క్యాలెండర్ లో దేవుడి ముఖం ఉత్తరం వైపు ఉండాలి. దీని వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. ఆ ఇంట్లోని సభ్యులకు దైవానుగ్రహం దండిగా ఉంటుంది. చేపట్టిన పని సానుకూలంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాలెండర్‌ను దక్షిణం వైపు ఉంచకూడదు. ఇలా చేస్తే ఇంట్లోని వ్యక్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వృత్తిపరమైన, వ్యక్తిగతమైన చికాకులు వస్తుంటాయి.
33
Laxmi Devi gets angry at these mistakes at night
కొందరైతే రకరకాల క్యాలెండర్లు గోడల నిండా వేలాడదీస్తుంటారు. ఇది ఆచరణీయం కాదు. ఇలా ఎక్కువగా పెట్టడం వల్ల పురోగతి కుంటుపడుతుంది. ఇంట్లో మనస్పర్ధలు వస్తుంటాయి. కుటుంబం సభ్యులు అనేక ఒత్తిళ్లకు గురవుతుంటారు. సంవత్సరం పూర్తవగానే కొందరు పాత క్యాలెండర్ పైనే కొత్తది వేలాడదీస్తుంటారు. అలా చేయకూడదు. పాతవి అట్టిపెట్టుకోవడం అరిష్టం. అలాగని పాతవాటిని ఏ చెత్తకుప్పల్లోనో, రోడ్డుపైనో పారేయకూడదు. వీటిని అగ్నికి ఆహుతి చేయాలి. లేదంటే.. నీటిలో వదిలేయాలి.
గమనిక: ఈ సలహాలు, అభిప్రాయాలు కేవలం నిపుణుల సూచనల ఆధారంగానే చేశాం.