హిందూ మతంలో దాతృత్వానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దానం చేయడం వల్ల పుణ్యం దక్కుతుందని నమ్ముతారు. అందుకే పురాణాలు పేదలకు దానధర్మాలు చేయాలని సూచిస్తున్నాయి. మత విశ్వాసాల ప్రకారం.. దానధర్మాలు చేయడం పుణ్యకార్యంగా పరిగణించబడింది. అయితే ఈ దానధర్మాల విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మీరు ఇబ్బంది పడటమే కాకుండా అవతలి వ్యక్తిని కూడా ఇబ్బందుల పాలు చేస్తుంది. అందుకే ఎలాంటి వస్తువులను దానం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
చీపురు
చీపురు మనకు అత్యవసరమైన వస్తువు. దీన్ని కేవలం శుభ్రపరిచే వస్తువుగానే చూస్తారు చాలా మంది. కానీ హిందూ మతంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ మతం ప్రకారం.. చీపురు లక్ష్మీ దేవికి సంబంధించినదిగా నమ్ముతారు. అందుకే చీపురును పొరపాటున కూడా దానం చేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. మీరు ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నమ్ముతారు.
Accupunture needles
కత్తులు, సూదులు, కత్తెర
పురాణాల ప్రకారం.. పదునైన వాటిని కూడా దానం చేయకూడదు. అంటే సూదులు, కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువులను దానం చేయడం మంచిది కాదని పురాణాల్లో పేర్కొనబడింది. ఒకవేళ మీరు వీటిని దానం చేస్తే ఇంట్లో కొట్లాటలు, గొడవలు జరిగే అవకాశం ఉంది.
నువ్వులు, ఆవనూనె
పురాణాల ప్రకారం.. కొన్ని రకాల నూనెలను కూడా దానం చేయకూడదు. ముఖ్యంగా నువ్వుల నూనె, ఆవ నూనెను పొరపాటున కూడా దానం చేయకూడదు. దీనివల్ల శనిదేవుడికి కోపం వస్తుందట. దీంతో మీకు అన్నీ సమస్యలే ఎదురవుతాయి. అంతేకాదు మీరు ఉపయోగించిన నూనెను అలాగే పాడైన నూనెను, మిగిలిన నూనెను కూడా ఎప్పుడూ దానం చేయకూడదు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. అన్నీ కష్టాలే కలుగుతాయి.
ఆహారానికి సంబంధించిన నియమాలు
పేదలకు, అవసరమైన వాటికి ఫుడ్ ను దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నారు. దీన్ని పుణ్యకార్యంగా భావిస్తారు. అయితే ఫుడ్ ను దానం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. మీరు దానం చేయాలనుకుంటున్న ఆహారం పాడైపోకూడదు. అలాగే చెడిపోకుండా ఉండాలి. పాడైపోయిన ఆహారాలను దానం చేస్తే మీకు పుణ్యం దక్కదు కదా.. కష్టాలోకి వెళ్లిపోతారు. ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.