గజానన నుంచి వినాయక వరకు.. గణేషుడికి ఈ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?

Ganesh Chaturthi 2023: వినాయకుడిని జ్ఞాన దేవుడిగా కూడా పూజిస్తారు. ఏ శుభకార్యమైనా ముందుగా విఘ్నేషుడికే పూజ చేస్తారు. ఎందుకంటే ఈయనను పూజించడం వల్ల ఆ పనికి ఎలాంటి ఆటంకం రాదని నమ్ముతారు. వినాయకుడు విఘ్నాలను నాశనం చేసేవాడు. గణేషుడిని పూజించడం వల్ల మీ జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
 

Ganesh Chaturthi 2023: know the meaning of different names of lord ganesha and the story behind them rsl

Ganesh Chaturthi 2023: సనాతన ధర్మంలో మొదటి ఆరాధ్య దైవం వినాయకుడు. వినాయక జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే వినాయక చవితిని దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. వినాయక పండుగను పది రోజుల పాటు జరుపుకుంటారు. అయితే వినాయకుడిని గణపతిని అని గజానుడు అని, లంబోదారుడు, విఘ్నహర్తుడు, గణపతి, వినాయకుడు, ఏక దంత అంటూ ఎన్నో పేర్లతో పిలుస్తారు. అసలు వినాయకుడికి ఈ పేర్లు ఎలా వచ్చాయి? వీటి వెనుకున్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

Ganesh Chaturthi 2023: know the meaning of different names of lord ganesha and the story behind them rsl

గణేషుడు అనే పేరు ఎలా వచ్చిందంటే? 

వినాయకుడికి ఉన్న పేర్లలో ఎంతో ముఖ్యమైన పేరు గణేషుడు. అయితే గణేషుడికి ఈ పేరు తల్లి పార్వతీ మాత నుంచి వచ్చింది. పురాణాల ప్రకారం.. పార్వతీదేవి తన దివ్య శక్తులతో వినాయకుడిని సృష్టించింది. అయితే ఆమె ఒకసారి స్నానానికి వెళుతున్నప్పుడు పసుపు పొడితో ఒక బొమ్మను తయారుచేస్తుంది. అయితే ఈ బొమ్మకు అతను ప్రాణం పోస్తాడు. దీంతో నువ్వు వీరుడివి అవుతారని పార్వతీదేవి చెప్పిందట. అందుకే ఈ దేవుడికి గణేష్ అనే పేరు పెట్టిందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. 


lord ganesha 0002

గజానన పేరు ఎలా వచ్చిందంటే? 

ఇతిహాసం ప్రకారం.. వినాయకుడికి జన్మనిచ్చిన తర్వాత పార్వతీదేవి స్నాన్నం చేయడానికి వెలుతూ గుమ్మం దగ్గర ఉన్న వినాయకుడిని లోపలికి ఎవరినీ రానీయకు అని ఆదేశిస్తుంది. అయితే శివుడు తన తండ్రి అన్న సంగతి గణేశుడికి తెలియదు. దీంతో అప్పుడే వచ్చిన పరమేశ్వరుడిని వినాయకుడు లోపలికి రానీయకుండా అడ్డుకుంటాడు. శివుడు ఎంత నచ్చజెప్పినా లోపలికి అసలే రానివ్వడు. దీంతో ఇరువురి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన మహాదేవుడు తన త్రిశూలంతో వినాయకుడి తలను నరికేస్తాడు.  అప్పుడే బయటకు వచ్చిన పార్వతీదేవి ఎంతో ఏడుస్తూ శివుడితో నువ్వు నా కుమారుడిని బతికించకపోతే నేను కూడా ప్రాణత్యాగం చేస్తానని చెప్తుంది. దీంతో శివుడు ఏనుగు తలను తెచ్చి వినాయకుడికి ప్రాణం పోస్తాడు. అందుకే గణేశుడిని గజాననుడు అని పిలుస్తారు.
 


ఏకదంత పేరు ఎలా వచ్చిందంటే? 

ఇతిహాసం ప్రకారం.. వేద వ్యాసుడు మహాభారతం రాయాలనుకుంటాడు. అయితే వ్యాసుడు మహాభారతం గురించి చెప్పుకుంటూ పోతారు. వినాయకుడు రాస్తుంటాడు. అయితే మధ్యలో సిరా అయిపోవడంతో వినాయకుడు ఏకంగా తన దంతాన్నే విరగొట్టి దాన్నే పెన్నుగా తయారుచేసి మహాభారత రచనను పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఆయనను ఏకదంతుడు అని పిలుస్తారు. 
 

లంబోదరుడు పేరు ఎలా వచ్చిందంటే? 

గణేశుడిని లంబోదరుడు అనికూడా అంటారు. లంబోదరుడు అంటే పొడవైన లేదా పెద్ద కడుపు అని అర్థం. పరమేశ్వరుడే వినాయకుడికి ఈ పేరు పెట్టాడట. బ్రహ్మ పురాణం ప్రకారం.. వినాయకుడు పార్వతీదేవి పాలను రోజంతా తాగేవాడు. అది గమనించిన శివుడు "నువ్వు లంబోడారుడిగా మారకుండా ఉండటానికి నువ్వు ఎక్కువగా పాలు తాగుతావు" అన్నాడు. అప్పటి నుంచి వినాయకుడిని లంబోదరుడు అని కూడా పిలుస్తారు.

వినాయక పేరుకు అర్థం

వినాయకుడు అంటే మహానుభావుడు అని అర్థం. వినాయకుడిని శివుడు ఏనుగు శిరస్సుతో మళ్లీ బతికించినప్పుడు.. ఆ సమయంలో దేవుళ్లు, దేవతలు అతనిని ఆశీర్వదిస్తారు. ఏ శుభకార్యానికైనా ముందు వినాయకుడిని పూజించాలని.. ఈయనే ప్రథమ ఆరాధ్య దైవం అంటారు. ఈ సమయంలోనే ఆయనకు వినాయకుడు అనే పేరు వచ్చింది.

Latest Videos

vuukle one pixel image
click me!