వాస్తు ప్రకారం.. ఆవు చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఇంట్లో పెడితే మీ అదృష్టం పెరుగుతుంది

First Published | Sep 21, 2023, 2:58 PM IST

హిందూ మతంలో ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు. వాస్తు ప్రకారం.. ఆవు చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మీ ఇంట్లో పెడితే మీ సంతోషం, అదృష్టం పెరుగుతాయి.
 

వాస్తు శాస్త్రం ప్రకారం..  ఇంటిని ఉంచితే ఎన్నో వాస్తు దోషాలు తొలగిపోతాయని చెబుతారు. ముఖ్యంగా ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవు. అలాగే ఇంట్లోపాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్ముతారు. వాస్తు ప్రాకారం.. మీ ఇంట్లో ఆవు విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచడం మంచిదని చెప్తారు. శ్రీకృష్ణుడికి ఆవు ఎంతో ఇష్టం. భూమికి చిహ్నమే ఆవు.  అందుకే దేవతలందరూ తల్లి ఆవులోనే నివసిస్తారని జ్యోతిష్యులు చెబుతారు. వేదాలన్నీ ఆవుల్లోనే ఉన్నాయి. పురాణాల ప్రకారం సముద్రం నుండి ఉద్భవించిన 14 రత్నాలలో కామధేను ఒకటి. వాస్తు ప్రకారం.. ఇంట్లో ఆవు చిత్రపటం లేదా విగ్రహాన్ని ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

vastu tips

1. ఆవు చిత్రపటాన్ని ఇంట్లో తూర్పు-ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల గొడవలు, దుఃఖాలు, ఆందోళనలకు కారణమయ్యే శక్తులు తొలగిపోతాయి. అలాగే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 

2. వాస్తు ప్రకారం.. మీ ఇంట్లో దూడకు పాలు ఇస్తున్న ఆవు విగ్రహం లేదా చిత్రపటాన్ని పెట్టడం వల్ల మీకు పండండి, మంచి గుణముండే బిడ్డ పుట్టే అవకాశం ఉంది. జంటలు తమ పడకగదిలో ఆవు చిత్రపటాన్ని పెట్టాలి.  వారు దీన్ని పదే పదే చూసే అవకాశం ఉంది. 
 


3. వాస్తు ప్రకారం.. ఇల్లును లేదా పెద్ద పెద్ద భవనాలను నిర్మించడానికి ముందు ఆవును పూజించండం మంచిది. 

4. అప్పుడే పుట్టిన దూడను ఆవు ఎంతో ప్రేమతో నాకుతుంది. ఇలాంటి చిత్రపటాలను ఇంట్లో పెడితే మీ పాపాలన్నీ తొలగిపోతాయట. 
 

5. ఆవులు ఉన్న ఇళ్లలో అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి. విష్ణు పురాణం ప్రకారం.. శ్రీకృష్ణుడు పాలు తాగడానికి భయపడినప్పుడు.. నంద దంపతులు ఆవు తోకను తిప్పి అతని వైపు చూసి భయాన్ని తొలగించారట.

6. ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు లేదా ఉన్నతాధికారులను కలిసేటప్పుడు ఆవుకు పచ్చిగడ్డిని పెట్టడం వల్ల అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. ఇది మీ భయాలను తొలగిస్తుంది. 
 

7. ఇంట్లోనే కాదు మీ ఆఫీసులో కూడా కామధేను ఆవు విగ్రహాన్ని ఉంచడం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మీ ఆలోచనలలో సానుకూల మార్పులను తెస్తుంది. అలాగే మీ సహనాన్ని పెంచుతుంది. ఇది మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. 

8. వ్యాపారంలో మంచి విజయం సాధించడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మీ ఇంటి ఉత్తర దిశలో రాధా-కృష్ణులు వేణువు వాయించడం, ఆవు వారి వెనుక ఉన్న ప్రతిమను మీ ఇంట్లో పెట్టండి.  ఇది మీ ఇంట్లో ప్రతికూల శక్తులను పోగొడుతుంది. మీ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవు.

Latest Videos

click me!