Spiritual: రుద్రాభిషేకం ఎలా చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి!

First Published | Oct 16, 2023, 12:15 PM IST

 Spiritual : శివుడు అభిషేక ప్రియుడు, దేనితో అభిషేకం చేసిన త్వరగా ప్రసన్నం అవుతాడు. రుద్రాభిషేకం చేస్తే  మహా ప్రీతి చెందుతాడు. అలాగే స్వామివారి కటాక్షం కూడా ఎల్లవేళలా మనపై ఉంటుంది. అయితే రుద్రాభిషేకం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చూద్దాం.
 

 పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే అభిషేకం చేయడం అనేది ఒక సులభమైన మార్గం. అందులోనూ స్వామివారికి  రుద్రాభిషేకం ఎంతో ప్రీతికరమైనది. అందుకే రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.శివుడికి రుద్రాభిషేకం చేసే సమయంలో శివలింగంపై మారేడు దళాలను ఉంచి ఒక్కొక్క కలశంలోని నీళ్ళతో కలిసి పూజ చేసి ప్రతి కలశంలో శివపంచాక్షరితో అభిమంత్రించాలి
 

ఇలా ముందుగా 108 కలశాలు  సిద్ధం చేసుకుని ఆ నీటిని శివ పంచాక్షరితో అభిమంత్రించి  సిద్ధంగా ఉంచుకోవాలి. ఇలా మారేడు దళాలుండే కలశంలో ఉన్న నీటితో అభిషేకం చేసినప్పుడే శివునికి రుద్రాభిషేకం పూర్తవుతుంది. అలాగే రుద్రాభిషేకం ప్రారంభించేముందు గణేశుడిని పూజించండి.
 


 తర్వాత ఉత్తర దిశలో శివలింగాన్ని ప్రతిష్టించండి. గంగాజలం తో అభిషేకం చేయండి. తర్వాత మీ కోరికలు శివయ్యకి విన్నవిస్తూ పంచామృతాలతో అభిషేకించండి. అభిషేకం చేస్తున్నప్పుడు మనసులో శివ మంత్రాన్ని మాత్రమే జపిస్తూ ఉండండి.
 

తదనంతరం శివలింగాన్ని మరొకసారి గంగాజలంతో శుద్ధి చేయండి. అనంతరం గంధం, భస్మం మొదలైన వాటితో శివుడికి అలంకరించండి. పువ్వులు, బిల్వపత్రాలు, వస్త్రం, రుద్రాక్ష మొదలైన వాటితో అలంకరణ చేయండి. తర్వాత శివునికి నైవేద్యం సమర్పించండి. స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించి హారతి ఇవ్వండి.
 

ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుడిని స్మరించుకోవాలి. శివుడికి సమర్పించే నైవేద్యంలో పులిహార ఉండేలాగా చూసుకోవాలి. పురుషుడు శివుని యొక్క గర్భగుడి కి వెళ్లే సమయంలో చొక్కాలు బదులుగా కండువాలను ధరించాలి.
 

 శివలింగానికి కచ్చితంగా జలాభిషేకం చేయాలి. అలాగే నాగమల్లి పువ్వులు అంటే శివునికి ఎంతో ప్రీతి. మీకు ఈ పువ్వులు అందుబాటులో ఉంటే కచ్చితంగా వాటితో శివుడిని పూజించండి, మహా పరమేశ్వరుని కరుణాకటాక్షాలు పొందండి.

Latest Videos

click me!