navratri 2023 bhog list
navratri 2023 నవరాత్రులు ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ రోజు దుర్గామాతను ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు నిష్టగా పూజచేస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగను అన్ని చోట్లా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. హిందూమతంలో నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి దుర్గాదేవిని పూజిస్తారు.
navratri 01
ఈ పండుగను దేశంలోని వివిధ ప్రాంతాలలో వేర్వేరుగా జరుపుకుంటారు. అందుకే ఈ పండుగను వివిద పేర్లతో పిలుస్తారు. కొంతమంది దీనిని దుర్గా పూజ అని పిలుస్తారు. మరికొందరు దీనిని కాళీ పూజగా జరుపుకుంటారు. ఈ సమయంలో దుర్గా దేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ తొమ్మిది రోజుల ప్రాముఖ్యత ఏమిటో? తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నవరాత్రుల్లో తొమ్మిది రోజుల ప్రాముఖ్యత
నవరాత్రులు అంటే "తొమ్మిది రాత్రులు" అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు అమావాస్య మరుసటి రోజు నుంచి లెక్కించబడతాయి. భగవంతుని స్త్రీ స్వభావానికి ప్రాతినిధ్యం వహించే దేవికి ఇది ఒక ప్రత్యేక సమయం. దుర్గ, లక్ష్మి, సరస్వతి అనే మూడు రూపాలు స్త్రీకి మూడు కోణాలుగా కనిపిస్తాయి. బలం లేదా అధికారం కోరుకునే వారు భూమాత, దుర్గా లేదా కాళీ వంటి స్త్రీ రూపాలను ఆరాధిస్తారు. సంపద, అభిరుచి లేదా భౌతిక వరాలను కోరుకునేవారు లక్ష్మీ లేదా సూర్యుడిని ఆరాధిస్తారు. జ్ఞానం పొందాలనుకునేవారు సరస్వతి దేవిని పూజిస్తారు.
అమ్మవారి మూడు రూపాలు
అందుకే నవరాత్రుల తొమ్మిది రోజులను వర్గీకరించారు. మొదటి మూడు రోజులు ఆరోగ్యానికి ప్రాతినిధ్యం వహించే దుర్గామాతకు, తర్వాత మూడు రోజులు సంపదకు ప్రాతినిధ్యం వహించే మహాలక్ష్మిదేవికి, చివరి మూడు రోజులు జ్ఞానానికి ప్రాతినిధ్యం వహించే మహా సరస్వతికి అంకితం చేయబడింది. జీవితంలోని ఈ మూడు అంశాలపై విజయానికి చిహ్నంగా పదవ రోజు విజయదశమిని జరుపుకుంటారు. మానవ మనుగడకు, శ్రేయస్సుకు దేవి మొదటి రెండు రూపాలు అవసరం. అలాగే సరిహద్దులు దాటి వెళ్లాలన్న ఆకాంక్ష మూడోది. అందుకోసం మహాసరస్వతిదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఆమె ఆశీస్సులు పొందలేరు.
Navratri 2023
నవరాత్రుల అసలు అర్థం
నవరాత్రులలో ఈ తొమ్మిది రోజుల్లో దుర్గా, లక్ష్మి, సరస్వతి దేవతల ఈ మూడు రూపాలను ఆరాధిస్తారు. ఇవి వరుసగా తమోగుణం, రాజోగుణం, శతగుణం అనే మూడు లక్షణాలకు ప్రతీక. జీవితంలో విజయం, సౌఖ్యాలు, సంతోషం కోసం ఈ మూడు గుణాలను సమతుల్యంగా ఉంచుకోవాలి. ఈ తొమ్మిది రోజులు మీ పూర్తి సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. పదవ రోజు విజయదశమి. అంటే విజయ దినం. ఇది చెడు ఎంత శక్తివంతమైనదైనా.. చివరికి మంచే గెలుస్తుందని చూపిస్తుంది.