navratri 2023: నవరాత్రి ఉపవాసం ఉండేవారు ఏం తినాలి? ఏం తినకూడదంటే?

First Published | Oct 16, 2023, 9:49 AM IST

navratri 2023: నవరాత్రులు మొదలయ్యాయి. అయితే నవరాత్రుల్లో చాలా మంది దుర్గమాతకు ఉపవాసం కూడా ఉంటుంటారు. అయితే ఇలాంటి వారు ఎలాంటి ఆహారాలను తినాలో? ఎలాంటి వాటిని తినకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. 
 

navratri 2023: సనాతన ధర్మంలో నవరాత్రి పండుగను ఎంతో ప్రత్యేకమైనదిగా, పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. అలాగే అమ్మవారికి నిష్టగా ఉపవాసం ఉంటారు కూడా. ఉపవాసం ఉంటూ నిత్యం పూజిస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతారు. ఈ ఏడాది శారదా నవరాత్రుల్లో మూడు ప్రత్యేక పూజలు చేస్తే భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి మీరు ఉపవాసం ఉంటే ఎలాంటి ఆహారాలను తినాలో? ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 


ఉపవాసం సమయంలో ఈ పదార్థాలను తినండి

1. పాలతో తయారు చేసిన ఉత్పత్తులు: నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు పాలతో తయారుచేసిన వస్తువులను తీసుకోవచ్చు. అంటే పాలు, పెరుగు, మజ్జిగ, తీపి లస్సీ, మఖానా ఖీర్ వంటివి తీసుకోవచ్చన్నమాట.  ఇది ఉపవాసం ఉండేవారిని ప్రశాంతంగా, రిలాక్స్ గా, ఎనర్జిటిక్ గా  చేస్తుంది. అలాగే ఆకలిగా కూడా అనిపించదు. 
 

Latest Videos


2. అమ్మవారికి ఉపవాసం ఉండేవారు మునగాకు, బంగాళాదుంప కూరగాయలతో ఉపవాసాన్ని ప్రారంభించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆకలిని భరించలేని వారు ఉపవాస దీక్ష విరమించిన తర్వాత వీటిని తినొచ్చట. 

3. సాబుదానా ఖిచ్డీ, ఖీర్: ఉపవాసం ఉన్నవారు సాయంత్రం పూట సాబుదానా ఖీర్ లేదా సాబుదానా ఖిచిడీని తినొచ్చు. 
 

4. పండ్లు: రోజులో పండ్లను ఎప్పుడైనా తినొచ్చు. పండ్లు శరీరాన్ని ఎనర్జిటిక్ గా మారుస్తాయి. ఉపవాసం ఉన్నవారు కేవలం పండ్లను తిన్నా రోజంతా హైడ్రేట్ గా ఉంటారు, అయితే తాజా పండ్ల రసాలను కూడా తాగొచ్చు. ఇది కూడా మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటుగా శక్తిని కూడా అందిస్తుంది. 
 

వీటిని తినకూడదు

1. ప్రాసెస్ చేసిన ఉప్పు:  ప్రాసెస్ చేసిన ఉప్పును తినకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. వంట చేసేటప్పుడు రాతి ఉప్పును మాత్రమే ఉపయోగించాలని సలహానిస్తారు.

2. నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు వెల్లుల్లి, ఉల్లిపాయలు, గుడ్లు, మాంసాన్ని తినకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

3. ఆల్కహాల్ - నవరాత్రుల సమయంలో మందుకు దూరంగా ఉండాలి. 

4. బియ్యం: నవరాత్రుల్లో అన్నం తినకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

5. గోధుమ పిండి: గోధుమ పిండితో చేసిన ఆహారానలు కూడా నవరాత్రి ఉపవాసం ఉండేవారు తినకూడదు.

click me!