Lord Rama or Hanuman Appears in Your Dreams: కలలు రకరకాలుగా ఉంటాయి. కొంత మందికి నిత్యం కలలు వస్తుంటాయి. అయితే అవి మంచి కలలు కావచ్చు. పీడకలలు కావచ్చు. పీడకలలు వచ్చినప్పుడు చాలా మంది భయపడుతుంటారు. ఏదైనా అశుభం జరుగుందుందేమో అని చింతిస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం నిద్రనుంచి లేవగానే అన్నీ మర్చిపోతుంటారు. ఇక కలలో ఎవరు వచ్చారు అనేదాన్నిబట్టి శుభమా.. లేక అశుభమా.. అనేది తెలుస్తుంది. దేవతలు, గుళ్లు గోపురాలు ఇలాంటివి కలలో వస్తే అది శుభసూచికంగా భావిస్తుంటారు. ఇక కలలో రాముడు కాని హనుమంతుడు కాని వస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసా?
hanumanji bhajan
పీడకలల సంగతి పక్కన పెడితే, కలలోదేవుడు కనిపిస్తే మంచి జరుగుతంది అని అంతా నమ్ముతుంటారు. అందులోను హనుమంతుడు కనిపించారనుకోండి అది ఇంకా శుభంగా భావిస్తుంటారు. కోతి రూపంలోనో, లేక విగ్రహరూపంగానో.. ఆంజనేయుడు కలలో వస్తే.. మనసులో భయాలు పోయి, మానసికంగా ధైర్యం వస్తుందని నమ్ముతుంటారు. అంతే కాదు ఇంట్లో ఉండేచికాకులన్నీ తొలిగిపోతాయట కూడా. భూత భయాలు, ఆందొళనలు, తగ్గి ప్రశాంతత కలుగుతుందట హనుమంతుడు కలలో కనిపిస్తే.
ఇక కలలో రాముడు కనిపిస్తే .. అటు ఆంజనేయుడు కృప కూడా వారికి ఉన్నట్టే. రాముడు కనిపిస్తే.. ఇంట్లో ప్రశాంతత వెల్లివిరుస్తుందట. ఏదైనా మంచి లక్ష్యం దిశగా అడుగులు వేసేవారికి కలలో శ్రీరాముడి దర్శనం కలిగితే.. ఆ పనులు సక్రమంగా జరగడంతో పాటు, జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కొనే ధైర్యం వస్తుందని అంటుంటారు. కలలో రామాలయం కనిపించినా చాలా మంచిదని తెలుస్తుంది. రామాలయం కలలో కనిపించడం ద్వారా కష్టాల్లో ఉన్నవారికి వాటినుంచి బయటపడటానికి దారి దొరుకుతుందని నమ్ముతారు.
ఇలా కలలు రకరకాల సూచనలు చేస్తుంటాయి. అయితే అందరు ఈ కలలను నమ్మరు. కొంతమందికిమాత్రమే వీటిపై నమ్మకం ఉంటుంది. పీడకలలు వచ్చినప్పుడు ఎక్కువ మంది భయపడుతుంటారు. ఏంజరుగుతందా అనే నెగెటీవ్ ఫీలింగ్ లో ఉంటారు. ఎవరో తరుముతున్నట్టు, ఏదైనా జంతువు కరిచినట్టు, వింత ఆకారాలు మీదకు వస్తున్నట్టు, ఇలా రకరకాల పీడకలలు రావడం కూడా సహజంగానే జరుగుతుంటుంది. వాటి విషయంలో భయపడకుండా.. ఆంజనేయుడి నామం జపించడం, హనుమాన్ చాలీసాను పటించడం మంచిదంటున్నారు పండితులు.