Chanakya Niti: చాణక్యుడి ప్రకారం నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా?
ఆచార్య చాణక్యుడి ప్రకారం.. ఎవరు నిజమైన స్నేహితుడు, ఎవరు శత్రువులో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
ఆచార్య చాణక్యుడి ప్రకారం.. ఎవరు నిజమైన స్నేహితుడు, ఎవరు శత్రువులో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
ఆచార్య చాణక్యుడు అర్థశాస్త్రంలో గొప్ప పండితుడు. భారతదేశ గొప్ప విద్వాంసుల్లో చాణక్యుడు కూడా ఒకరు. ఆయన కేవలం ఆర్థిక శాస్త్ర సంబంధిత విషయాలు మాత్రమే కాదు, మనిషి జీవితానికి అవసరం అయ్యే చాలా విషయాలను చెప్పారు. ఆయన చెప్పిన విషయాలను ఇప్పటికీ అనుసరిస్తే.. జీవితంలో విజయం సాధించగలరు.
చాణక్యుడు తన నీతి శాస్త్రంలో సంబంధాలు, డబ్బు, వ్యాపారం మొదలైన ముఖ్యమైన విషయాల గురించి కూడా చప్పారు. మరి, ఆయన ప్రకారం.. మంచి స్నేహితుడు ఎలా ఉంటాడు..? శత్రువును ఎలా గుర్తించాలి? ధనవంతులు ఎవరు అవుతారు అనే విషయాలు తెలుసుకుందాం..
ఆచార్య చాణక్యుడు జీవితంలో నిజమైన స్నేహితుడిని కచ్చితంగా గుర్తించాలని చెప్పాడు. జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికీ కష్టాలు వస్తాయి. ఆ కష్ట సమయంలో అండగా ఉండి, ఆపదలో ఒంటరిగా వదలని వాళ్లే నిజమైన స్నేహితులు. మంచి స్నేహితుడు మంచి, చెడులు చెబుతాడు. మీరు ఏది చెప్పినా.. కరెక్ట్ అంటూ సపోర్ట్ చేసేవారు నిజమైన స్నేహితులు కాలేరు. మీరు తప్పు చేస్తే..అది తప్పు అని నిర్భయంగా చెప్పేవారు మాత్రమే మంచి స్నేహితులు అవుతారు.
ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం, ఆపద సమయంలో ధనం సహాయపడుతుంది, కానీ ధనం లేనప్పుడు జ్ఞానమే వ్యక్తిని రక్షిస్తుంది. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించాలి. నిత్యం డబ్బు కోసం పరిగెత్తేవారు... జీవితంలో విజయం సాధించలేరు. డబ్బు కంటే జ్ఞానం గొప్పదని గ్రహించిన వారు ఆలస్యంగా అయినా వృద్ధిలోకి వస్తారు. జ్ఞానం ఉన్నవాళ్లు ఎప్పటికైనా డబ్బు కూడా సంపాదించడగలరు.
జీవితంలో మనకు నచ్చనివారిని చాలా మంది శత్రువులుగా భావిస్తారు. కానీ, ఆచార్య చాణక్యుడి ప్రకారం మనిషికి ఆకలి అనేది అతి పెద్ద శత్రువు. ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు కాబట్టి ఆకలి గొప్ప శత్రువు. ఆకలి ఎవరితోనైనా ఎలాంటి నీచమైన పని అయినా చేపిస్తుందట. ఈ శత్రువను జయించినవారు.. జీవితంలో ఏదైనా సాధించగలరు.