చాలా మంది ప్రతిరోజూ అనేక మంది దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని సంతోషపెడితే.. ఆర్థిక సమస్యలు ఉండవని, డబ్బుకు లోటు ఉండదని నమ్ముతుంటారు. అయితే, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని పనులు కచ్చితంగా చేయాలట. మరి, ఏం చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం...
25
లక్ష్మీదేవికి ఇష్టమైన శంఖం..
శంఖానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. దేవుడిని పూజించేటప్పుడు శంఖాన్ని ఊదడం అనే సంప్రదాయం చాలా సంవత్సరాలుగా దేవాలయాలలో కొనసాగుతుంది. విష్ణు పూరాణంలో కూడా లక్ష్మీదేవి శంఖంలో నివసిస్తుందని ప్రస్తావిస్తారు.అందుకే.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం.. పూజ గదిలో శంఖం ఉంచుకోవాలట. ఇలా ఉంచుకుంటే, లక్ష్మీదేవి కాటాక్షం లభిస్తుందట. శంఖువు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు.
35
ఇంట్లో చీపురు ఎలా ఉంచుకోవాలి
ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురు వాస్తు పరంగా చాలా ముఖ్యమైనది. లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని నమ్ముతారు. చీపురును అవమానించకూడదు లేదా దానం చేయకూడదని వాస్తులో ప్రస్తావించారు.మీరు చీపురుపై అడుగు పెడితే లేదా ఎవరికైనా దానం చేస్తే, లక్ష్మీదేవి మీపై కోపంగా ఉండవచ్చు.దీని కారణంగా మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. చీపురు పాడైపోతే.. కొత్త చీపురును శనివారం కొనుగోలు చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది.
తులసి మొక్కను దేవతగా పూజిస్తారు. విష్ణువు అవతారమైన కృష్ణుడు తులసిని భూమికి తీసుకువచ్చాడని నమ్ముతారు. తులసి ఆకులు లేకుండా కృష్ణుడు ఆహారం కూడా తీసుకోడు. లక్ష్మీదేవి తులసిలో నివసిస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం, తులసి మొక్కను ఇంటికి తూర్పు దిశలో నాటాలి. తూర్పు దిశలో స్థలం లేకపోతే, తులసి మొక్కను ఇంటికి ఉత్తర దిశలో కూడా నాటవచ్చు. ఇలా చేయడం ద్వారా, మహాలక్ష్మి ఇంట్లో నివసిస్తుంది.
55
తామర పువ్వు
మహాలక్ష్మి కమలం పువ్వుపై కూర్చుని ఉండటం చూడవచ్చు. కమలం పువ్వు లక్ష్మీ దేవికి చాలా ప్రియమైనది. మహాలక్ష్మి కమలంలో నివసిస్తుంది. వాస్తు ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక కుండలో నీటిని నింపి, అందులో వికసించే కమలం పువ్వును ఉంచడం ద్వారా మీరు మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు మీ ఇంట్లో కమలం పువ్వును ఉంచుకుంటే.. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.