తాబేలు ఉంగరం ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

First Published | Feb 3, 2024, 9:52 AM IST

జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి తలరాతను మార్చగల ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. హిందూ మతంలో తాబేలును చాలా పదంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. తాబేలు విష్ణుమూర్తి అవతారం. అందుకే ఇంట్లో తాబేలు విగ్రహాన్ని పెడితే శుభ ఫలితాలను పొందుతారు. 

పలు నమ్మకాల ప్రకారం.. ఎన్నో జంతువులను, పక్షులను అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. కాగా చాలా మంది తాబేళ్లను ఇంట్లో కూడా పెంచుకుంటారు. దీని వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.  అలాగే కొంతమంది తాబేలు విగ్రహాన్ని దేవుడి గుడిలో పెడుతుంటారు. మరి తాబేలు విగ్రహాన్ని ఇంట్లో పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


తాబేలు ఉంగరం

చాలా మంది తాబేలు ఉన్న ఉంగరాలను ధరించడం చూసే ఉంటారు. కాగా ఈ తాబేలు ఉంగరాన్ని.. శుక్రవారం, అక్షయ తృతీయ, దీపావళి లేదా ధనత్రయోదశి నాడు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహం జాతకుడిపై ఉంటుంది. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. 
 


లోహ తాబేలు

చాలా మంది ఇండ్లలో మెటల్ తాబేలును కూడా ఉంచుకుంటారు. ఫెంగ్ షుయ్ ప్రకారం.. లోహ తాబేలును ఉత్తర దిశలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఈ సమయంలో మీ కోరికలు ఏవైనా తీరాలనుకుంటే ఖాళీ కాగితంపై ఎర్రటి పెన్నుతో మీ కోరికను రాయండి. తర్వాత ఈ స్లిప్పును తాబేలు లోపల ఉంచండి. దీనిని ఉత్తర దిశలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి.
 

తాబేలు యంత్రం

జ్యోతిష పరంగా చూస్తే తాబేలు యంత్రాన్ని ఇంట్లో ప్రతిష్టించడం వల్ల మీకు ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. తాబేలు యంత్రం స్థాపనకు శుక్రవారం లేదా పౌర్ణమి తిథిని శుభప్రదంగా భావిస్తారు. ఇది కాకుండా.. మీరు దీనిని శుభ సమయంలో కూడా స్థాపించొచ్చు.
 

తాబేలు చిత్రం 

మీరు ప్రధాన ద్వారంపై తాబేలు చిత్రాన్ని ఉంచితే.. అది మీ వ్యాపారంలో మీకు లాభాన్ని ఇస్తుంది. దీనితో పాటుగా నెగెటివ్ ఎనర్జీ ఇంటికి దూరంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతతను కాపాడుతుంది.

Latest Videos

click me!