magha masam
magha masam 2024: కృష్ణ పక్షం ప్రతిపాద తిథి నాడు మాఘ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జనవరి 26న మాఘమాసం ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 24న మాఘ పౌర్ణమితో ముగుస్తుంది. ఈ మాసం చాలా ముఖ్యమైనది. పవిత్రమైంది. ఎందుకంటే ఈ సమయంలో ఎన్నో పండుగలను జరుపుకుంటారు. దీనితో పాటుగా ఈ మాసంలో మనం పాటించాల్సిన ఎన్నో నియమాలు కూడా ఉన్నాయి. వీటిని పాటిస్తే మీ ఇల్లు ఆనందంతో నిండుతుంది.
మాఘమాసంలో వీటిని కొనుగోలు చేయొద్దు
మాఘ మాసంలో మనం చేయకూడనివి చాలానే ఉన్నాయి. నాణేలు, వెండి పాత్రలు, ఇత్తడి పాత్రలను ఈ మాసంలో కొనకూడదని నమ్ముతారు. అలాగే ఈ నెలలో ముల్లంగిని తినకూడదు. మాంసాన్ని కూడా తినకూడదు. ముఖ్యంగా ఆల్కహాల్ ను తాగకూడదు. ఈ నియమాలను పాటిస్తే మీ జీవితం ఆనందంగా సాగుతుంది. లేదంటే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
magha masam
మాఘ మాసం ప్రాముఖ్యత
పవిత్రమైన నదీ స్నానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాఘ మాసం చాలా ముఖ్యమైందిగా భావిస్తారు. పుష్య పూర్ణిమ నుంచి మాఘ పూర్ణిమ వరకు మాఘ స్నానం చాలా పవిత్రమైంది. ఈ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
మాఘమాసంలో ఈ మాసంలో నియమాలను పాటిస్తే మీ జీవితంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, మోక్షం లభిస్తాయి. ఈ మాసం మొత్తం శ్రీ హరి విష్ణువు, శ్రీకృష్ణుని ఆరాధనకు అంకితం చేయబడింది.