మాఘ మాసంలో శివరాత్రి ఎప్పుడొస్తుందో తెలుసా?

First Published Jan 30, 2024, 11:16 AM IST

మాసిక శివరాత్రి పండుగను ప్రతి నెలా కృష్ణపక్షం చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈ సారి మాఘ మాసంలో ఫిబ్రవరి 8న మాస శివరాత్రి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శివుడు, పార్వతిని పూజిస్తారు. అంతేకాదు ఈ రోజు పెళ్లి అయిన, పెళ్లి కాని మహిళలు ఉపవాసం కూడా ఉంటారు. 
 

ప్రతి నెలలో.. మాసిక శివరాత్రిని జరుపుకుంటాం. ఈ శివరాత్రి కృష్ణ పక్షం చతుర్దశి రోజునే వస్తుంది. కాగా ఇది మాఘ మాసం. కాబట్టి మాస శివరాత్రి ఫిబ్రవరి 8న వచ్చింది. ఈ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు పరమేశ్వరుడిని నిష్టగా పూజిస్తారు. ఉపవాస దీక్షలు కూడా ఉంటారు. అందుకే మాస శివరాత్రి పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

మాస శివరాత్రి శుభ సమయం

రోజువారీ పంచాంగం ప్రకారం.. మాఘ మాసం చతుర్దశి తేదీ ఫిబ్రవరి 8 ఉదయం 11.17 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 9 ఉదయం 8.02 గంటలకు ముగుస్తుంది. ఈ ఏడాది మాఘ శివరాత్రిని ఫిబ్రవరి 8న జరుపుకోనున్నారు.
 

మాఘ శివరాత్రికి శుభ సమయం

మాఘ శివరాత్రి రోజున ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. ఈ రోజును శివుడు, పార్వతీదేవి ధ్యానంతో ప్రారంభించండి. దైనందిన పనులు అయిపోయాక స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి.  తర్వాత సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలి. ఆ తర్వాత ఎర్రటి గుడ్డ పెట్టి మహాదేవ, పార్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. ఇప్పుడు శివపార్వతులను నియమాల ప్రకారం పూజించండి. పెళ్లి కాని అమ్మాయిలు పార్వతీదేవికి కుంకుమను సమర్పించాలి. అలాగే బిల్వప్రతం, తెల్లని పువ్వులు, అక్షతలు మొదలైన వాటిని శివుడికి సమర్పించాలి. దీనివల్ల తొందరగా పెళ్లి అవుతుంది. 

శివరాత్రి ఆరాధనలో శివ మంత్రాలను ఖచ్చితంగా పఠించాలి. అలాగే శివ చాలీసా పఠించడాన్ని కూడా శుభప్రదంగా భావిస్తారు. చివరగా శివుడికి, పార్వతీదేవికి పండ్లను, స్వీట్లను సమర్పించాలి. ఆ తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి. 
 

click me!