దసరా పండుగకు అంతా మంచే జరగాలంటే ఇంట్లో నుంచి వీటిని తొలగించండి!

Published : Sep 19, 2025, 03:12 PM IST

దేవీ నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నవరాత్రులు ప్రారంభమయ్యే ముందు ఇంట్లో నుంచి కొన్ని వస్తువులను తొలగించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చట. మరి వేటిని ఇంట్లో ఉంచకూడదో చూద్దాం.  

PREV
15
వాస్తు చిట్కాలు

ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు సెప్టెంబర్ 22న ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులపాటు దేవీ మాత వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంది. ప్రతి ఒక్కరు తమ జీవితంలో మంచి జరగాలని.. అమ్మవారిని వేడుకుంటారు. అయితే నవరాత్రుల ముందు కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లో సమస్యలు తొలగిపోయి, సంపదకు మార్గం సుగమం అవుతుందట. నవరాత్రులు ప్రారంభమయ్యే ముందు ఇంట్లో నుంచి కొన్ని వస్తువులను తీసివేస్తే అంతా మంచే జరుగుతుందట. మరి అవేంటో తెలుసుకుందామా..

25
విరిగిన విగ్రహాలు

మీ పూజగదిలో విరిగిన విగ్రహాలు ఉంటే, శరన్నవరాత్రులు ప్రారంభం అయ్యేలోపు వాటిని తొలగించడం మంచిది. ఆ విగ్రహాలను పారే నీటిలో వదిలేయవచ్చు. విరిగిన విగ్రహాలు ఇంట్లోకి ప్రతికూల శక్తిని పెంచుతాయి. దానివల్ల కుటుంబంలో కష్టాలు, నష్టాలు, బాధలు పెరిగిపోతాయి. 

35
పాత బూట్లు, చెప్పులు

జ్యోతిష్య పండితుల ప్రకారం.. నవరాత్రులు ప్రారంభమయ్యే ముందు మీ ఇంట్లో ఉన్న పాత బూట్లు (old shoes), చెప్పులను పడేయండి. ఇవి ప్రతికూలతకు చిహ్నం. వీటిని ఇంట్లో ఉంచడం వల్ల పేదరికం వస్తుంది. ఏ పని చేసినా ఆటంకాలు, నష్టాలు తప్పవు. 

45
పనిచేయని గడియారాలు

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో పాడైపోయిన గడియారాలు, విరిగిపోయిన గాజు వస్తువులు ఉండటం మంచిదికాదు. అవి దురదృష్టాన్ని తెస్తాయట. కాబట్టి.. మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలు ఉంటే నవరాత్రులు ప్రారంభమయ్యే ముందే బాగు చేయించండి. లేదా వాటిని ఇంటి నుంచి తొలగించండి. 

55
పాత, పాడైన చీపుర్లు

చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు. కాబట్టి విరిగిన లేదా పాడైపోయిన చీపురును ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. శరన్నవరాత్రులు ప్రారంభమయ్యే ముందు ఇంట్లోని ప్రతికూలతను తొలగించడానికి విరిగిన లేదా పాడైపోయిన చీపురును బయట పడేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories