వ్యాపారం చేస్తూ మన భవిష్యత్తు మెరుగుపరుచుకోవాలి అనుకున్నప్పుడు వ్యాపారం చేసే భవనం ఉత్తరానికి అభిముఖంగా ఉండడం ఉత్తమం, ఈశాన్యం వాయువ్యం కూడా మంచివే. ఈ దశలకు అభిముఖంగా భవనంగాని, కార్యాలయంగాని ఉండే పక్షంలో పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది.
అంటే ఒకరకంగా ఇది సంపద పెరగడానికి దోహదపడుతుంది. అలాగే పని చేసే ప్రదేశంలో ఈశాన్యం మూలలో మన ఇష్టదైవం పటం ఉంచటం అవసరం. వ్యాపార ప్రదేశానికి సంబంధించి ఎన్ని దోషాలు ఉన్నా అవి పరిహారమైపోతాయి. అలాగే ఇంట్లో టాయిలెట్ ఎప్పుడు ఉత్తరం వైపు ఉండకూడదు.
ఇది మీకు అవకాశాలు రాకుండా నిరోధిస్తుంది. అలాగే మీరు ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే మీరు తూర్పుముఖంగా లేదా ఉత్తర ముఖంగా కూర్చోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ శ్రమను అందరికీ బహిర్గతం చేస్తుంది. అలాగే మనం పని చేసే ప్రదేశం సువాసనలను వెదజల్లటం వలన కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
computer course
అలాగే వ్యాపారం ప్రారంభిస్తున్న ప్రదేశం దీర్ఘ చతురస్రాకారం గానో లేదో చతురస్రాకారంగానో ఉండటం చాలా మంచిది. మనం పని చేసే ప్రదేశం సమతులంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనివలన తక్కువ కాలంలో లాభాలు ఆర్జించటానికి అవకాశం ఉంటుంది.
అలాగే గదిలో బీరువా ఉత్తర స్థానంలో ఉండడం మంచిది. ఎందుకంటే ఉత్తరం కుబేర స్థానం. ఈ స్థానంలో బీరువా ఉండటం వలన ధనం అనవసరంగా ఖర్చు కాకుండా నిలువ ఉంటుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ కూడా ఉత్తరదిక్కులోనే ఉండడం గమనార్హం.
అలాగే ఇల్లు ఎక్కడో ఉండి ఇంటి యజమాని మరో దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభావం ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు ని దెబ్బతీస్తుంది. కాబట్టి లేదా ఆఫీసు వాస్తు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.