వినాయక చవితి 2023: విఘ్నేషుడి తొండం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Ganesh Chaturthi 2023: వినాయక చవితి ఉత్సవాలు మొదలయ్యాయి. మరి ఈ సందర్భంగా వినాయకుడి గురించి, ఆయన తొండం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం.. 
 

Ganesh Chaturthi 2023: విఘ్నాలను తొలగించే దేవుడిగా వినాయకుడికి పేరుంది. వినాయకుడి ఆశీస్సులు ఉంటే అన్ని విధాలా మనం బాగుంటామని ఆయన భక్తులు నమ్ముతారు. ఆయన ఉనికి అలాంటిది. వినాయక చవితి సందర్భంగా వినాయకుడి గురించి, ఆయన తొండం గురించి మనం కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

వినాయకుడి తొండం ప్రాముఖ్యత

విఘ్నేషుడి తొండం విశ్వ ధ్వని అయిన ఓం లోని ఒక భాగాన్ని సూచిస్తుంది. ఈ తొండం ఫ్లెక్లిబుల్ గా ఉంటుంది. అందుకే ఇది మార్పునకు అనుగుణంగా ఉంటుంది. బొజ్జగణపయ్య తొండం ఎప్పుడూ కూడా ఆహారానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ఇది గణేషుడికి ఉన్న ఆహారం పట్ల ఇష్టాన్ని తెలియజేస్తుంది. అందుకే వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో పెడితే ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి కొదవ ఉండదంటారు జ్యోతిష్యులు. అంతేకాదు వినాయకుడు తన తొండాన్ని ఉపయోగించే జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తాడు. మంచి పురోగతి సాధించేలా చూస్తాడు. ఆయనను పూజిస్తే ఇంట్లో సంపద పెరుగుతుంది. జీవితంలో కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. 
 


ganesh chaturthi 2023

వినాయకుడి తొండం దిశ

వినాయకుడి విగ్రహాలకు తొండం వేరే వేరే దిశలో ఉంటుంది. ఏ దిక్కున ఉందో పెద్దగా అర్థం కాకపోవచ్చు. కానీ ఈయన తొండం దిశ ఎంతో అర్థాన్ని కలిగి ఉంటుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. వినాయక విగ్రహాల తొండం ఎడమ వైపు, కుడివైపు, నిటారుగా అంటూ అన్ని దిశల్లో వేలాడుతూ ఉంటుంది. అయితే ప్రతి దిశ కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే చాలా మటుకు వినాయకుడి తొండం  ఎడమ వైపునే ఉంటాయి. అయితే కొన్ని విగ్రహాలకు నిటారుగా కూడా ఉంటుంది. అయితే దేవాలయాల్లో కుడివైపు తొండం ఉన్న వినాయక విగ్రహాలను పెడుతుంటారు. 
 

ఎడమ వైపు తిరిగి ఉన్న వినాయక తొండం ప్రాముఖ్యత

అయితే ఇంట్లోకి మాత్రం ఎడమ వైపు తొండం ఉన్న వినాయక విగ్రహాలను కొంటుంటారు. ఇలాంటి విగ్రహాలు ఇంట్లో శాంతి, సంపద, స్త్రీ శక్తిని తెస్తాయని నమ్ముతారు. వాస్తు దోశం కూడా తొలగిపోతుంది. ఎడమ వైపు తిరిగి ఉన్న వినాయక విగ్రహాలకు వైద్యం చేసే శక్తి, సామర్థ్యాలు ఉన్నాయని నమ్ముతారు. ఇలాంటి విగ్రహాలను ఇంటికి తీసుకోవడం వల్ల ఇంట్లో సంబంధాలు బాగుంటాయి. మీరు ఆరోగ్యంగా ఉంటారు. సంపద కూడా పెరుగుతుంది. అలాగే ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లోకి తీసుకొచ్చే వినాయక విగ్రహం కూర్చున్న భంగిమలో, ఎమడ వైపు తొండం ఉన్న వాటినే తీసుకోరావాలని పండితులు చెబుతున్నారు. 

ganesh chaturthi 2023

కుడివైపున ఉన్న వినాయకుడి తొండం ప్రాముఖ్యత

కుడివైపు తొండం ఉన్న వినాయకులను చాలా అరుదుగా చూస్తాం. ఇలాంటి వినాయక విగ్రహాలు ఎక్కువగా దేవాలయాల్లోనే ఉంటాయి. ఈ విగ్రహం మగతనాన్ని సూచిస్తుంది. లేదా ప్రతిదానిని నాశనం చేస్తుంది. మోక్షం కోసమో, ప్రాపంచిక సుఖాల నుంచి విముక్తి కోసమో నిల్చొని ఉన్న వినాయకుడి తొండం కుడివైపునకు తిరిగింది. ఈయనను ఆరాధించడం వల్ల అపారమైన ఆనందం కలుగుతుందని నమ్ముతారు. కుడివైపు తొండం తిరిగి ఉన్న వినాయకుడిని పూజించడం వల్ల తక్షణ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. అందుకే సిద్ధి వినాయకుడు అంటే వరాలను ప్రసాదించే వినాయకుడు అనికూడా అంటారు. 
 

ganesh chaturthi 2023

నిటారుగా ఉన్న వినాయకుడి తొండం ప్రాముఖ్యత

కుడి, ఎడమలో కంటే నిటారుగా ఉన్న వినాయకుడి విగ్రహాలను చూడటం చాలా చాలా అరుదు. ఇలాంటి వినాయక విగ్రహాలను ఇంటికి తీసుకురావడం వల్ల మీ మానసిక స్థితి బాగుంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీ కుటుంబంలో మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంటే స్ట్రెయిట్ గా ఉన్న తొండం ఉన్న వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకురండి.  
 

Latest Videos

click me!