Spiritual : స్నానం చేసాక ఈ పనులు చేయకండి.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది!

First Published | Sep 19, 2023, 10:00 AM IST

 Spiritual: స్నానం చేసిన తర్వాత ఇంక బాత్రూం తో పని అయిపోయింది అని మళ్ళీ మరుసటి రోజు స్నానానికి వెళ్లే వరకు దాని గురించి పట్టించుకోము. అయితే స్నానం అయ్యాక మనం తెలియక చేసే కొన్ని పనులు  మనకి ఎంతో ఆర్థిక నష్టాన్ని తెస్తాయి అవి ఏమిటో చూద్దాం.
 

 బాత్రూం అనేది చాలామందికి  స్నానం చేసే గది మాత్రమే. స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా ఆ గదిని గురించి పెద్దగా శ్రద్ధ తీసుకోము. కానీ అలా చేయటం వాస్తు శాస్త్రం ప్రకారం దోషం అంటున్నారు నిపుణులు. అలాగే ప్రతికూల శక్తి కూడా ఎక్కువగా బాత్రూం నుంచే ఉత్పత్తి అవుతుంది ఈ విషయం చాలామందికి తెలియదు.
 

అందుకే స్నానం చేసిన తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే స్నానం చేసిన తర్వాత మనం బాత్రూంలో చేయకూడని పనులు ఏంటో ఒకసారి చూద్దాం.
 

Latest Videos


స్నానం చేసిన తర్వాత బకెట్లో నీళ్లు మిగల్చకూడదు. ఎవరైనా మీరు మిగిల్చిన నీటితో స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అది మీకూ మంచిది కాదు, వాళ్లకి కూడా మంచిది కాదు ఇద్దరికీ దురదృష్టాన్ని తీసుకువస్తుంది.
 

 అలాగే వివాహమైన స్త్రీలు తలస్నానం చేసిన వెంటనే కుంకుమ బొట్టు పెట్టకూడదు. ఇది వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. తల ఆరిన తరువాత అప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకోండి. అలాగే స్నానం చేసిన వెంటనే పదునైన వస్తువులని ఉపయోగించవద్దు.స్నానానికి ముందు మాత్రమే గోళ్ళని కత్తిరించుకోవాలి. అలాగే బాత్రూంలో తడి బట్టలు ఉంచకండి.

ఇలాచేయటం వల్ల ఇంట్లో సూర్యుని స్థానం బలహీన పడుతుంది. స్నానం చేసిన తరువాత బాత్రూం ని నీట్ గా, పొడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. మీ బాత్రూం ఏ మాత్రం గజిబిజిగా లేదా అపరిశుభ్రంగా ఉన్నా ఆర్థికంగా చాలా నష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
 

 అలాగే స్నానం చేసి నేరుగా వెళ్లి అగ్నిని తాకకూడదు. ముందుగా ఏదైనా తిని అప్పుడు వంటగదిలోకి వెళ్లాలి. అలాగే స్నానం అయిన వెంటనే బకెట్ ని ఖాళీగా ఉంచకుండా శుభ్రమైన నీటిని నింపి ఉంచండి. అలా వీలుకాని పక్షంలో ఆ బకెట్ ని బోర్లించండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వాస్తు, గ్రహదోషాల నుంచి తప్పించుకోవచ్చు.

click me!