Vstu Tips: మీ బెడ్‌ రూమ్‌ లో వీటిని పెడుతున్నారా..అయితే కోరి మరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే!

Published : Jul 12, 2025, 03:21 PM IST

వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో కొన్ని వస్తువులు ఉంటే సమస్యలు ఎదురవుతాయి. అసలు బెడ్ రూమ్ లో ఏఏ వస్తువులు పెట్టకూడదు..పెడితే వాటి వల్ల నష్టాలు ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.

PREV
17
వాస్తు-జీవనశైలి

ఇంటిని నిర్మించేటప్పుడు వాస్తు శాస్త్రం పాటించాలన్న ఆలోచన చాలామందిలో ఉంటుంది. అయితే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణంలోనే కాదు, మన జీవనశైలిలోనూ అంతర్భాగంగా ఉంటుంది. ముఖ్యంగా పడకగదిలో కొన్ని వస్తువులను ఉంచితే అది మన ఆరోగ్యం, ఆర్థిక స్థితి, మనసుస్థితిని ప్రభావితం చేస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

27
వాస్తు-పడకగది

వాస్తు ప్రకారం పడకగదిలో కొన్ని వస్తువులు ఉంటే జీవితంలో శాంతి-సంతోషాలు దూరమవుతాయని స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది దేవుళ్ల విగ్రహాలు, చిత్రాలు. చాలామందికి వీటిని ఇంట్లో ప్రతిక్షణం చూడాలని ఉంటుంది. కానీ వాటిని పడకగదిలో ఉంచడం శుభం కాదని వాస్తు చెబుతోంది. అది మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. దీర్ఘకాలంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయట. అందుకే వాటిని పూజా గదిలో ఉంచడమే శ్రేయస్కరం.

37
చీపురు

చీపురును కూడా పడకగదిలో ఉంచకూడదు. చీపురు లక్ష్మీ దేవి ప్రతీకగా భావించబడుతుంది. దాన్ని పడకగదిలో ఉంచితే సంపద నష్టాలు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చీపురును శుభ్రమైన ప్రదేశంలో, ముఖ్యంగా వంటగది కర్నర్‌లో లేదా స్టోర్‌రూమ్‌లో ఉంచడం మంచిదని సూచిస్తున్నారు.

47
చనిపోయిన వారి ఫోటోలు

చనిపోయిన వారి ఫోటోలు కుటుంబ సభ్యులు కీర్తిగా వారి ఫోటోలు ఉంచడం సహజమే. కానీ వాటిని పడకగదిలో ఉంచడం శుభసూచకం కాదు. శాస్త్ర ప్రకారం, ఇది ఆ శక్తిని లోపలికి ఆకర్షిస్తుంది. ఫలితంగా మనసు స్థిరంగా ఉండదు, కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. ఆ ఫోటోలను హాల్‌లో లేదా వరండాలో గౌరవంగా ఉంచడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

57
పదునైన వస్తువులు

పదునైన వస్తువులు కూడా అలాగే. కత్తులు, కత్తెరలు లాంటి పదార్థాలను పడకగదిలో ఉంచినప్పుడు, అవి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయి. ఇలా ఉండటంతో అనర్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ పదార్థాలను వంటగదిలో గాని, పనిముట్ల ప్రదేశాల్లో గాని ఉంచాలి. అప్పుడే ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటుంది.

67
మతపరమైన గ్రంథాలు

మతపరమైన గ్రంథాల విషయానికి వస్తే, భగవద్గీత, రామాయణం, మహాభారతం లాంటి పవిత్ర గ్రంథాలను పడకగదిలో ఉంచడం సరికాదు. ఎందుకంటే, పడకగది విశ్రాంతి కోసం మాత్రమే కాదు, దాంపత్య జీవితానికి కూడా కీలకమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో మతపరమైన పుస్తకాలను ఉంచడం వాటిని అవమానించడమే అవుతుంది. అందుకే ఆ పుస్తకాలు పూజా గదిలో, దేవుళ్ల ఫోటోల దగ్గర ఉంచాలి.

77
చిన్న చిన్న తప్పులు

వాస్తు శాస్త్రం ప్రకారం మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా జీవితం మీద ప్రభావం చూపుతాయి. వాటిని సరిచేసుకోవడం వల్ల మన ఇంటిలో శాంతి, సౌఖ్యం, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతాయి. ముఖ్యంగా పడకగది అంటే మనం జీవితం మూడో భాగం గడిపే ప్రదేశం. అది శుభకరం గానూ, శక్తివంతంగా ఉండాలంటే, పై చెప్పిన వస్తువులను అక్కడ ఉంచకుండా జాగ్రత్తపడాలి.

Read more Photos on
click me!

Recommended Stories