Vara Lakshmi Vratam: ఈసారి వరలక్ష్మి వ్రతం మూడో వారం...ఇలా ఎందుకు వచ్చిందంటే!

Published : Jul 11, 2025, 10:52 AM IST

2025లో శ్రావణ మాసం జులై 25 నుంచి ఆగస్టు 22 వరకు ఉంది. ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8న జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు ఉన్నాయ్.

PREV
17
శ్రావణ మాసం

ఆషాడ మాసం తొలి ఏకాదశి పండుగతో హిందువుల పండుగలన్ని మొదలవుతాయనే విషయం తెలిసిందే. ఇంకో పదిహేను రోజుల్లోఆషాడం ముగియబోతుంది కూడా. ఆషాడం ముగిసిందంటే...శ్రావణం మొదలు...హిందువులకు ఎంతో పవిత్రమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. మహిళలు ఈ నెల మొత్తం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ నెలలో దేవాలయాలు అన్ని కూడా ఎంతో కళకళలాడుతుంటాయి.

27
ప్రతిరోజు ఓ పూజ,వ్రతం

మహిళలు తమ ఇళ్లను కూడా దేవాలయాల మాదిరిగా తయారు చేస్తారు. ఎందుకంటే ఈ మాసంలో లక్ష్మీ దేవి కచ్చితంగా తమ ఇళ్లకు వస్తుందని వారంతా భావిస్తారు. ఈ పవిత్ర మాసం ప్రతిరోజు ఓ పూజ,వ్రతంతో గృహాలన్ని కనుల విందుగా ఉంటాయి. అలాంటి పవిత్రమాసంలో చేసే వరలక్ష్మీ వ్రతం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. దీన్ని శ్రద్ధగా ఆచరిస్తే సంపద, శాంతి, శుభం కలుగుతాయని స్త్రీల నమ్మకం.

37
ఎన్ని శ్రావణ శుక్రవారాలు

ఇదిలా ఉంటే ఈ ఏడాదిసంవత్సరం శ్రావణమాసం ఎప్పటినుంచి మొదలు కానుంది? వరలక్ష్మీ వ్రతం ఏ వారం చేసుకోవాలి? ఈ ఏడాది ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి? అంటే…

47
శ్రావణమాసం ఎప్పుడు మొదలు కానుందంటే..!

ఈ సంవత్సరం శ్రావన మాసం జులై 25 నుంచి మొదలవుతుంది. ఈ మాసం మొదటి రోజే శుక్రవారంతో ప్రారంభమైంది. ఆగస్టు 22న ముగుస్తుంది. అంటే మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు ఈసారి రానున్నాయి.

మొదటి వారం: జులై 25,రెండో వారం: ఆగస్టు 1,మూడో వారం: ఆగస్టు 8, నాలుగో వారం: ఆగస్టు 15,ఐదో వారం : ఆగస్టు 22 వచ్చాయి.

ఈ శుక్రవారాల్లో ప్రతి వారం ప్రత్యేకతే కానీ, వరలక్ష్మీ వ్రతం జరుపుకునే రోజు ఇంకా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు.

57
ఈసారి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు జరుపుకోవాలంటే..

2025లో వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8న వస్తోంది. ఇది శ్రావణ మాసంలో మూడవ శుక్రవారం. వ్రతం చేసే సమయంలో తిథి, నక్షత్రాలు, ముహూర్తాలు ముఖ్యమైనవి కాబట్టి పండితులు మూడో వారాన్ని వరలక్ష్మీ వ్రతం జరుపుకోమని చెబుతున్నారు.

67
శ్రావణ మాస విశిష్టతలు

ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతంతో పాటు మంగళవారం రోజున జరుపుకునే మంగళగౌరీ వ్రతం కూడా ఎంతో పవిత్రమైనదిగా పండితులు వివరిస్తారు. ఈ మాసం అంతా దేవతల పూజలు, శుభ కార్యాలు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. చంద్రునికి పూజ చేయడం ద్వారా మనశ్శాంతి కలుగుతుందని అనేక హిందూ గ్రంథాలు చెబుతున్నాయి.

77
ఈసారి ఐదు మంగళవారాలు కూడా

2025లో శ్రావణ మాసంలో ఐదు మంగళవారాలు కూడా వచ్చాయి. ఇలా మంగళవారాలు, శుక్రవారాలు ఎక్కువగా రావడం అనేది చాలా అరుదైన విషయం.

పూజల వల్ల కలిగే ఫలితాలు

ఈ మాసంలో లక్ష్మీదేవిని, గౌరీదేవిని పూజించడం వల్ల ఐశ్వర్యం, ఆనందం, కుటుంబ శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం ఉంది. ఇది వ్రతాల కాలం మాత్రమే కాదు, మనసు ప్రశాంతంగా ఉంచే శుభమాసంగా కూడా పరిగణిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories