ప్రతినెలా కూడా రెండు ఏకాదశులు వస్తాయి. ఇలా సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. మార్గశిర మాసంలో పౌర్ణమి ముందు వచ్చే పరమ పవిత్రమైన ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. ముక్కోటి ఏకాదశి శ్రీమన్నారాయణునికి (Srimannarayanudu) ప్రీతికరమైన రోజు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం (North Gate) వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు.
ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులను ఆశీర్వదిస్తాడు. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులను చేయకపోయినా ఈ ఒక్క ఏకాదశి జరుపుకుంటే మూడు కోట్ల ఏకాదశులు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజునే హాలహలం, అమృతం (Amrutham) రెండూ పుట్టాయని ఈ రోజునే శివుడు (Lord Shiva) హాలహలాన్ని సేవించాడని మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు, అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని మన పురాణ కథనం.
సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ముక్కోటి అంటే మూడు కోట్ల దేవతలను ఒక్కసారిగా మనం అందరినీ దర్శనం (Vision) చేసుకునే అనువైన రోజునే ఈ ముక్కోటి ఏకాదశి రోజు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు అన్నీకూడా తెరుచుకుని ఉంటాయి. వైష్ణవాలయాలలో, అన్ని దేవాలయాలలో (Temples) కూడా ఉత్తర ద్వారాలు తెరుచుకుని ఉంటాయి.
ఈ రోజున ఉత్తరద్వారం గుండా భగవంతున్ని దర్శించుకుంటే సకల పాపాలు (All sins), గ్రహ దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు (Ashtaishwaryas) లభిస్తాయి. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి నియమ నిష్టలతో పూజిస్తే పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరడంతో పాటు మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున మరణించినవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
పూజా విధానం: సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా ఇంటిని శుభ్రపరచుకుని (Clean up) తలస్నానం చేసి తెల్లటి వస్త్రాలు ధరించి ఇంటి ముందు ముగ్గులు, గడపకు పసుపు, కుంకుమ రాసి పూలతో అలంకరించి, పూజ మందిరానికి మామిడి తోరణాలు కట్టి, ముగ్గు వేసి పసుపు, కుంకుమలతో అలంకరించాలి.
పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించాలి. స్వామివారికి పువ్వులు (Flowers), తులసి దళాలను సమర్పించాలి.
ముక్కోటి ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే సర్వపాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే విష్ణుమూర్తికి నైవేద్యంగా పాయసం (Payasam), తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను సమర్పించాలి. ఈ రోజున ఉపవాసం (Fasting) ఆచరిస్తే మంచి ఫలితం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున 12 గంటలలోపు పూజను పూర్తి చేయాలి. ఈ రోజున ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీకు అన్నీ విజయాలే కలుగుతాయి. ఈ రోజున విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం మంచిది.