Sankranthi 2022: భోగినాడు భోగి పండ్లను పిల్లలకు ఎందుకు పోస్తారో తెలుసా?

Navya G   | Asianet News
Published : Jan 11, 2022, 03:38 PM IST

Sankranthi 2022: కొత్త సంవత్సరము మొదటి నెలలో వచ్చే అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతికి ముందు వచ్చే భోగి పండుగ (Bhogi panduga) రోజు భోగి పండ్లను చిన్నపిల్లల తలపై నుంచి పోస్తారు. ఇలా భోగి పండ్లను పిల్లల తలపై నుంచి పోసి దిష్టి తీయడాన్ని మన పెద్దలు ఒక ఆచారంగా నమ్ముతారు. ఇప్పుడు మనము ఈ ఆర్టికల్ ద్వారా పిల్లలకు భోగి పండ్లు (Bhogi pandlu) ఎందుకు పోస్తారో తెలుసుకుందాం..  

PREV
16
Sankranthi 2022: భోగినాడు భోగి పండ్లను పిల్లలకు ఎందుకు పోస్తారో తెలుసా?

భోగి పండ్లను రేగి పండ్లు అని కూడా అంటారు. భోగి పండ్లను భానుడి చిహ్నంగా భావిస్తారు.  సంక్రాంతి సమయంలో వచ్చే భోగి రోజు పిల్లలకు భోగి పండ్లను పోస్తే పిల్లల మానసిక రుగ్మతలు (Mental disorders) తగ్గిపోతాయని, వారి ఎదుగుదల బాగుంటుందని  నమ్మకం (Believe). భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పండ్లు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులుగా భావిస్తారు.
 

26

ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. భగ అనే పదం నుండి భోగి అనే పదాన్ని తీసుకున్నారు. రేగి చెట్టును సంస్కృతంలో బదరీ  వృక్షమని (Badari plant) అంటారు.కనుక రేగి పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు. రేగి పండ్లను శ్రీమన్నారాయణ స్వామి (Srimannarayana Swamy) ప్రతిరూపంగా భావిస్తారు. అలాగే భోగి పండ్లు సూర్యభగవానుడికి ప్రీతికరమైన ఫలం.
 

36

శివుని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు (Penance) చేశారని కథనం. ఆ సమయంలో దేవతలు వారి తల మీద బదరీ ఫలాలను కురిపించారని చెబుతారు. ఆనాటి పురాణ కథనం ప్రకారం పిల్లలను నారాయణుడుగా భావించి భోగిపండ్లు పోసే సంప్రదాయం (Tradition) మన పెద్దలు పాటిస్తున్నారు. 
 

46

భోగి పండ్లను 12 ఏళ్లలోపు పిల్లలకు పోస్తారు. భోగిపండ్లు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణ్యాలు (Coins), చెరుకు గడ ముక్కలు (Pieces of sugar cane) కలిపి పిల్లల తలపై పోస్తారు. ఇలా పిల్లలకి తలమీద నుంచి భోగిపండ్లు పోసి వారికి దిష్టి తీస్తారు. ఇలా పోసిన తర్వాత కింద పడ్డ భోగి పండ్లను ఎవరు తినకూడదు. దిష్టి తీసిన భోగి పండ్లను ఎవరూ తొక్కని ప్రదేశములో పడివేస్తారు.
 

56

భోగి పండ్లను పిల్లల తలపై పోవడంతో శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహం (Grace) పిల్లలపై ఉంటుందని, పిల్లలకు ఉన్న దిష్టి తొలగిపోయి, వారి ఆరోగ్యం (Health) బాగుంటుందని పెద్దల నమ్మకం. మన బాహ్య నేత్రాలకు కనిపించని బ్రహ్మరంధ్రం  మన తల పైన భాగంలో ఉంటుంది. ఈ భోగిపండ్లు పోసి ఆ రంధ్రాన్ని ప్రేరేపిస్తే పిల్లల జ్ఞానవంతులవుతారని విశ్వాసం.
 

66

భోగిపండ్లు సూర్య కిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. కనుక ఈ పండ్లను తలమీద పోవడంతో ఇందులోని విద్యుచ్ఛక్తి శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావాన్ని (Effect) చూపించి మంచి ఫలితాన్ని (Good result) అందిస్తుందని మన పెద్దలు నమ్ముతారు. అందుకే పిల్లలకు భోగి రోజు భోగిపండ్లు పోసి ఆశీర్వదిస్తారు.

click me!

Recommended Stories