ఈ ప్రదేశంలో ప్రధాన సందర్శనీయ ఆకర్షణలుగా గురువాయురప్పస్ దేవాలయం, మమ్మీయూర్ మహాదేవ ఆలయం, పార్థసారథి దేవాలయం, చోవల్లూర్ శివాలయం, చాముండేశ్వరి దేవాలయం, వెంకటాచలపతి దేవాలయం, హరికన్యక దేవాలయం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూరాల్ పెయింటింగ్, పాలయూర్ చర్చి, ఏనుగుల శిబిరం ఇలా మొదలకు ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలు ఒకొక్కటి ఒకొక్క విశిష్టతను (Uniqueness) కలిగి పర్యాటకులను ఆకట్టుకునేలా (Impressive) ఉంటాయి.
గురువాయూరప్పస్ దేవాలయం: భారతదేశంలోని నాలుగవ అతి పెద్ద దేవాలయంగా గురువాయూరప్పస్ దేవాలయం (Guruvayoorappas Temple) ఉంది. ఈ గుడి కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి. ఈ ఆలయంలో ప్రధాన దైవం బాల గోపాలస్ (Bala Gopalus) కృష్ణుడి శిశువు ఉన్నారు. ఈ ఆలయంలో ఉన్న ప్రధాని విగ్రహానికి నాలుగు చేతులలో శంఖం, సుదర్శన చక్రం, కౌముదకి, పద్మం ఉంటాయి.
ఏనుగుల శిబిరం: గురువాయురప్పస్ దేవాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో పున్నుతుర్ కొట్టలో (Punnuthur Kotta) ఏనుగుల శిబిరం ఉంది. ఇది ఇండియాలోనే అతి పెద్ద ఏనుగుల శిబిరం (Elephant camp). ఈ శిబిరంలో సుమారు 60 ఏనుగులు ఉన్నాయి. ఈ శిబిరాన్ని సందర్శించడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. దేవాలయపు పండుగలలో, ఉరేగింపులలో ఈ ఏనుగులను ఉపయోగిస్తారు.
మమ్మీయూర్ మహాదేవ ఆలయం: గురువాయురప్పస్ దేవాలయానికి అతి సమీపంలో మమ్మీయూర్ మహాదేవ ఆలయం (Mammiyur Mahadeva Temple) ఉంది. ఈ గుడిలో ప్రధాన దైవం మహాదేవుడు. ఈ ఆలయంలో పార్వతీ దేవి (Parvati Devi) విగ్రహం కూడా ఉంది. ఈ ఆలయంలో గణపతి, సుబ్రహ్మణ్య, అయ్యప్ప, విష్ణువులను కూడా దర్శించవచ్చు.
పార్థసారథి దేవాలయం: గురువాయూర్ పట్టణంలో ప్రధాన ఆకర్షణగా పార్థసారథి దేవాలయం (Parthasarathy Temple) ఉంది. ఈ దేవాలయం రథం ఆకారంలో ఉంటుంది. ఈ దేవాలయంలోని విగ్రహాన్ని ఆది శంకరాచార్యులవారు (Adi Shankaracharya) ప్రతిష్టించారు. ఈ దేవాలయ సందర్శన మీకు తప్పక నచ్చుతుంది.
హరికన్యక దేవాలయం: గురువాయూర్ కు సమీపంలోని అరియనూర్ (Ariyanur) గ్రామంలో హరికన్యక దేవాలయం (Harikanyaka Temple) ఉంది. హరికన్యక అంటే విష్ణువు కన్యగా ఉన్నప్పటి అవతారం. మార్చి ఏప్రిల్ నెలలో 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలను తిలకించడానికి వేలాది పర్యాటకులు వస్తారు.
వెంకటాచలపతి దేవాలయం: పార్థసారథి దేవాలయానికి సమీపంలో వెంకటాచలపతి దేవాలయం (Venkatachalapathy Temple) ఉంది. ఈ దేవాలయంలో విష్ణుమూర్తి వెంకటాచలపతి అవతారంలో దర్శనమిస్తారు. ఈ దేవాలయ సందర్శన ఆధ్యాత్మిక భావనతో పాటు మనసుకు ప్రశాంతతను (Calmness) కలిగిస్తుంది. ఈ దేవాలయాన్ని సందర్శించడానికి ప్రతి ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.