Spiritual : నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్లయితే.. కర్పూరం నెయ్యితో ఈ విధంగా చేయండి!

Published : Oct 30, 2023, 04:58 PM IST

 Spiritual : విశ్వంలో సానుకూల శక్తి ప్రతికూల శక్తి అని రెండు రకాల శక్తులు ఉంటాయి.  సానుకూల శక్తులు మంచి ఫలితాలని ఇస్తే ప్రతికూల శక్తులు మన యొక్క వినాశనాన్ని కోరుకుంటాయి. అయితే నెయ్యి మరియు కర్పూరాన్ని ఉపయోగించి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించవచ్చు. అది ఎలాగో చూద్దాం.  

PREV
16
 Spiritual : నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్లయితే.. కర్పూరం నెయ్యితో ఈ విధంగా చేయండి!

 ఈ విశ్వంలోనే కాదు మన ఇంట్లో, పరిసరాల్లో ఆఖరికి మన శరీరంలో కూడా నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం వాటిని కళ్ళతో చూడలేము కానీ వాటి యొక్క ప్రభావాలని అనుభవిస్తాము. ప్రతికూల శక్తులు మన చుట్టూ ఉన్నప్పుడు మనకి ఏ విషయంలోనూ మంచి జరగదు.
 

26

 అయితే అలాంటి నెగటివ్ ఎనర్జీని బయటికి పంపించడం వలన మనం పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించిన వాళ్ళం అవుతాము. అందుకే నెగిటివ్ ఎనర్జీని కర్పూరం మరియు నెయ్యితో ఎలా తొలగించవచ్చో ఇప్పుడు చూద్దాం.
 

36

నేతిలో రెండు కర్పూరం బిళ్ళలు వేసి పొద్దున్న సాయంత్రం రెండు పూటలా కాల్చడం వలన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ బయటికి పోతుంది. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడినప్పుడు భర్త దిండు కింద కర్పూరం ఉంచండి.

46

ఉదయం పూట ఆ కర్పూరాన్ని  పడకగదిలోనే వెలిగించండి. ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ కాలిపోయి ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అలాగే కర్పూరాన్ని నెయ్యితో కలిపి ఇంటి ముఖద్వారం దగ్గర, పడకగది ముందు రాయటం వలన ప్రతికూలశక్తులు..
 

56

ఇంట్లోకి రావడానికి అనుకూలత ఏర్పడదు. అలాగే రాత్రిపూట పీడకలలతో బాధపడే వారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. అలాగే శంఖంలో నీళ్లు పోసి కొంత సమయం పాటు అలా వదిలేయండి.
 

66

ఆ తర్వాత ఆ నీటిని మన ఇంట్లో గాని వ్యాపారం చేసుకునే స్థలంలో గాని ఎక్కడ ప్రతికూలత ఉంది అనిపిస్తే అక్కడ జల్లటం వలన సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఉప్పునీరు కూడా నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపటానికి సహాయపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories