సనాతన ధర్మంలో సూర్యభగవానుడి పూజ ముఖ్యమైనదిగా భావిస్తారు. ప్రతి ఆదివారం నాడు ఖచ్చితంగా సూర్యభగవానుడిని పూజిస్తారు. ఈ రోజు సూర్యభగవానుని పూజించే వారికి రాజ సుఖం లభిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా సూర్యుని పూజలో నీటిని సమర్పించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మీ జాతకంలోని సూర్యుని చెడు ప్రభావం పోతుందని విశ్వసిస్తారు.
సూర్యభగవానుడికి నీటిని సమర్పించే ఆచారం పురాతన కాలం నుంచి భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైనది. అర్ఘ్యం సమర్పించడం వల్ల కలిగే సానుకూల ప్రభావాల గురించి వేదాలు, హిందూ గ్రంధాలలో ప్రస్తావించబడింది. వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సూర్యభగవానుడు అన్ని గ్రహాలపై తన ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు.
ఆదివారం నాడు అర్ఘ్యం సమర్పించడం వల్ల మీ కీర్తి, పేరు, తెలివితేటలు, జ్ఞానం, శక్తి, అధికారం, శక్తి పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ అర్ఘ్యం సక్రమంగా చేస్తేనే పూజా ఫలితాలను పొందుతారని పండితులు చెబుతున్నారు. చాలా మంది తెలిసో తెలియకో కొన్ని తప్పులను చేస్తుంటారు. ఈ తప్పుల వల్ల పూజా ఫలితాలను అస్సలు పొందరు. మరి సూర్యభగవానుడికి పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రోజు ఉదయాన్నే నిద్రలేవాలి. తర్వాత తలస్నానం చేయాలి.
మీరు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు చెప్పులు లేదా బూట్లను వేసుకోకూడు. వట్టికాళ్లతోనే అర్ఘ్యం సమర్పించాలి.
అర్ఘ్యం సమర్పించడానికి ముందు కొన్ని పువ్వులు, అక్షతలను నీటిలో వేయాలి.
నీటిని తూర్పు ముఖంగా సమర్పించాలి.
సూర్యభగవానుడికి సూర్యోదయం సమయంలో నీటిని సమర్పించాలి.
నీరు సమర్పించేటప్పుడు సూర్య మంత్రం లేదా గాయత్రి మంత్రాన్ని పఠించాలి.
సూర్యభగవానుడిని నిష్టగా ప్రార్థించండి.
చివరగా.. సూర్యభగవానుడికి నమస్కరించి పూజను ముగించాలి.