ఉగాది పండగ ప్రాముఖ్యత
ఉగాది అంటే కొత్తగా ప్రారంభమయ్యేది అని అర్థం. ఈ కొత్తగా ప్రారంభమయ్యే రోజు నుంచి జీవితం కూడా ఆనందంతో నిండాలని కోరుకుంటారు. అయితే జీవితం అంటే కష్టసుఖాల సమ్మేళనం. ఇది సత్యం. ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉగాది పచ్చడి తయారు చేస్తారు. అందులో ఆరు రకాల రుచులు కలిపి తయారు చేస్తారు. తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు ఇలా ఆరు రుచులతో నిండిన ఈ పచ్చడి జీవితం ఎలాంటిదో తెలియజేసేందుకు ఉదాహరణ. ఈ తత్వాన్ని అర్థం చేసుకొని ఉగాది రోజు నుంచి కొత్తగా, కొత్త పనులతో జీవితం ప్రారంభించాలని పండితులు చెబుతారు.