హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రంలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. వాటిని అనుసరిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం అన్ని పనులు చేయడం వల్ల జీవితం బాగుంటుందని ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని చాలామంది నమ్ముతారు. మరి వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఫోటోను ఇంట్లో ఎక్కడ పెడితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీదేవి ఫోటోను ఏ దిక్కున పెట్టాలి?
లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఏ దిక్కున పెట్టాలో వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. లక్ష్మీదేవి ఫోటోను తప్పు దిక్కున పెడితే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఆగిపోతాయి. అంతేకాదు ఇంట్లో పేదరికం పెరుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవి ఫోటోను ఏ దిక్కున పొరపాటున కూడా పెట్టకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
లక్ష్మీదేవి ఫోటోను ఈ దిశలో పెట్టాలి..
హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపద దేవతగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులో ఉంచాలి. ఈ దిక్కులో లక్ష్మీదేవి ఫోటోను పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ఈ దిక్కు ఆనందం, శ్రేయస్సుకి చిహ్నంగా చెప్పబడుుతుంది. ఈ దిక్కులో లక్ష్మీదేవి ఫోటోను పెడితే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని చెబుతారు.
లక్ష్మీదేవి ఫోటోను ఈ దిక్కులో పెట్టకండి!
వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఫోటోను లేదా విగ్రహాన్ని పొరపాటున కూడా దక్షిణం లేదా నైరుతి దిక్కులో పెట్టకూడదు. ఈ దిక్కులో పెడితే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. దీని కారణంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.
వాస్తు నియమాల ప్రకారం..
- ఇంట్లో పెట్టే లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఆ ఫోటో చుట్టూ వెలుతురు ఉండాలి. చీకటి, మురికి ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి.
- వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఫోటోతో పాటు వినాయకుడి ఫోటోను కలిపి పెట్టడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
- లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం దగ్గర తప్పకుండా ఒక దీపం వెలిగించాలి.
- లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని పొరపాటున కూడా మీరు పడుకునే గది, వంటగది దగ్గర ఎప్పుడూ పెట్టకూడదు