Ugadi: ఉగాది పచ్చడి ఎందుకు తినాలి?
ఈ పండగ రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఈ పచ్చడి పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు అనే ఆరు రుచుల సమ్మేళనం.
ఈ పండగ రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఈ పచ్చడి పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు అనే ఆరు రుచుల సమ్మేళనం.
ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనమందరం ఉగాది పండగను జరుపుకుంటాం. దీనిని తెలుగు సంవత్సరాదిగా పిలుస్తాం. ఈ పండగను కొత్త శుభారంభానికి సంకేతంగా సూచిస్తారు. ఈ పండగ రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఈ పచ్చడి పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు అనే ఆరు రుచుల సమ్మేళనం. ఈ షడ్రుచుల సమ్మేళనం మన జీవితంలో వచ్చే అనుభవాలుగా భావిస్తారు.
శాస్త్రీయంగా చూస్తే, ఉగాది పచ్చడిలోని ప్రతి పదార్థం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి. తీపి కోసం బెల్లం, పులుపు కోసం చింతపండు, చేదు కోసం వేప పూత, వగరు కోసం మామిడి కాయ, కారం , ఉప్పు వీటిని కలిపి ఈ పచ్చడి తయారు చేస్తాం. మరి, దేని వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం..
1.చేదు( వేప పువ్వు)
వేపపూతకు విశేషమైన ఔషధ గుణాలున్నాయి. ఇది శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థను బలపరిచే గుణాలను కలిగి ఉంది. వేపలో ఉండే యాంటీబాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు సీజనల్ వ్యాధుల నుంచి రక్షణను కల్పిస్తాయి.
2.తీపి( బెల్లం)
బెల్లం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది రక్తశుద్ధి చేయడంలో సహాయపడుతుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. చక్కెర కంటే బెల్లం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. ఇదే కారణంగా ఉగాది పచ్చడిలో బెల్లాన్ని ఉపయోగిస్తారు.
3.వగరు( మామిడికాయ)
మామిడికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో పెదవులు పగులకుండా, నీరు కోల్పోకుండా చర్మాన్ని రక్షించడంలో మామిడికాయ సహాయపడుతుంది.
4.పులుపు( చింతపండు)
చింతపండు జీర్ణ క్రియను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల దాహం, అలసట నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, బరువు తగ్గే గుణాలనూ కలిగి ఉంది.
5.కారం
కారం కూడా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పరిమితంగా తీసుకుంటే జీర్ణ క్రియ మెరుగవుతుంది. శరీరంలోని క్రిమికీటకాలను నివారించడంలో సహాయపడుతుంది.
6.ఉప్పు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఈ ఉగాది, ఆరోగ్యానికి మేలు చేసే ఉగాది పచ్చడిని ఆనందంగా స్వీకరించండి. ఇది కేవలం ఓ పండుగ ప్రత్యేకత మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని రక్షించే సంప్రదాయ ఔషధం కూడా!