ఉత్తరప్రదేశ్‌లోని సారనాథ్ లో చూడవలసిన అందమైన ప్రదేశాలు ఇవే!

First Published | Jan 9, 2022, 3:25 PM IST

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని వారణాసికి పది కిలోమీటర్ల దూరంలో సారనాథ్ (Sarnath) అనే చిన్న గ్రామం ఉంది. ఇక్కడ గౌతమ్ బుద్ధుడు మొదటి ధర్మాన్ని బోధించాడు. ఈ ప్రదేశంలో బలమైన బౌద్ధమత మూలాలు ఉన్నాయి. భారతదేశంలోని ప్రసిద్ధిచెందిన బౌద్ధమత ప్రదేశాలలో సారనాథ్ ఒకటి. ఈ ప్రాంతంలో అనేక సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

ఈ ప్రదేశంలో భారతీయ చక్రవర్తి అయిన అశోక చక్రవర్తి (Emperor Ashoka) నిర్మించిన అనేక స్థూపాలు ఉన్నాయి. ఇక్కడ అశోక చక్రవర్తి పాలనా కాలం నాటి స్తంభాలలో అశోక స్థూపం (Ashoka Stupam) ప్రసిద్ధి చెందినది. ఈ స్థూపంలో ఉన్న నాలుగు సింహాల బొమ్మ నేడు భారత దేశ జాతీయ చిహ్నంగా ఉంది. ఈ స్థూపం లో ఉన్న చిన్న చక్రం జాతీయ జెండా స్థానంలో గర్వకారణంగా ఉంది.
 

సారనాథ్ లో అనేక సందర్శనీయ బౌద్ధమత నిర్మాణాలు (Buddhist structures) ఉన్నాయి. వీటితోపాటు రాజుల కాలంనాటి అందమైన కట్టడాలు, శిల్ప కళలు, పార్కులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి అందమైన వాతావరణం (Beautiful weather) పర్యాటకుల మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
 

Latest Videos


సారనాథ్ లో చౌఖండి స్థూపం, ధమ్మేక్ స్థూపం, సారనాథ్ మ్యూజియం, మూలగంధ కుటి హారర్ ఇలా ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు ప్రధాన ఆకర్షణగా (Attraction) ఉన్నాయి. ఈ ప్రదేశాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అశోకుడు బౌద్ధ మతంలోకి మారిన తర్వాత మొదటగా చౌఖండి స్థూపాన్ని (Chaukhandi Stupa) నిర్మించారని పురాణకథనం.
 

సారనాథ్ లోని ప్రధాన ఆకర్షణగా ధమ్మేక్ స్థూపం (Dhammek Stupa) ఉంది. ఇసుక, రాతి మిశ్రమంతో ఈ స్థూపాన్ని నిర్మించారు. సారనాథ్ వెళ్లినప్పుడు ఈ స్తూపాన్ని తప్పక సందర్శించండి. సారనాథ్ లో తప్పక సందర్శించవలసిన ప్రదేశంగా సారనాథ్ మ్యూజియం (Sarnath Museum) ఉంది. ఈ మ్యూజియంలో అనేక కళాఖండాలు ఉన్నాయి. మూలగంధ కుటి విహార్ 1931లో మహాబోధి సమాజం నిర్మించబడింది. దీనితో పాటు థాయ్ ఆలయం, కగ్యు టిబెటన్ ఆశ్రమం కూడా నిర్మించారు.
 

సారనాథ్ ను సందర్శించడానికి వారణాసి (Varanasi) నుంచి రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. సారనాథ్ ను సందర్శించడానికి నవంబర్ నుండి మార్చి వరకు ఉత్తమమైనది. ఈ ప్రాంత సందర్శన పర్యాటక ప్రియులకు బాగా నచ్చుతుంది. ఇక్కడి అందమైన వాతావరణం మనసుకు ఆహ్లాదాన్ని (Enjoy) కలిగిస్తుంది.

సారనాథ్ కు వెళ్లినప్పుడు ఈ ప్రదేశాలను తప్పక సందర్శించండి. సారనాథ్ లో ఉన్న స్థూపాలు ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులను (Buddhists) ఆకర్షిస్తున్నాయి. విశాలమైన ప్రకృతి దృశ్య తోటలు నేడు సారనాథ్ స్మారక చిహ్నాల అవశేషాలను (Remains of monuments) అలంకరించాయి. వీటిని సందర్శించిన మనసుకు ప్రశాంతత కలుగుతుంది. వారణాసికి దగ్గరగా ఉన్న ఈ ప్రదేశం భారతదేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి.
 

click me!