Puri Jagannath Temple: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని యాత్ర మొదలైంది. అయితే, పెళ్లి కాని జంటలు ఈ ఆలయానికి కలిసి వెళ్లకూడదు అనే ప్రచారం ఉంది. దీనిలో నిజం ఎంత? దీని వెనక ఉన్న కథేంటి?
లక్షలాది మంది భక్తులు ఎదురుచూసే పూరీ జగన్నాథుని రథ యాత్ర జులై 16న మొదలైంది. ఒడిశాలోని పూరీలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తుంటారు. ఆ స్వామి దర్శన భాగ్యం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. స్వామి వారు స్వయంగా వెలసిన ఈ పూరీ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటి ప్రకారం, ఈ ఆలయానికి పెళ్లి కానివారు జంటగా వెళ్లకూడదనే నమ్మకం ఉంది.
24
ఆలయంలోకి అడుగుపెడితే ఏమౌతుంది?
స్థానిక కథనాల ప్రకారం, పెళ్లికాని వారు జంటగా ఈ ఆలయం గర్భగుడిలోకి అడుగుపెట్టకూడదు. అలా వెళ్తే.. వారి బంధంలో సమస్యలు వస్తాయని.. వారికి వివాహ కూడా జరగే అవకాశాలు తగ్గుతాయని అక్కడివారు నమ్ముతారు. అందుకే చాలా మంది ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ.. వేర్వేరుగా ఈ ఆలయానికి వెళతారు కానీ, జంటగా మాత్రం వెళ్లరు. కానీ.. ఇది అక్కడివారి నమ్మకం. ఆలయ నిబంధనల్లో అలాంటి రూల్స్ ఏమీ లేకపోవడం గమనార్హం.
34
పౌరాణిక కథలు ఏం చెబుతున్నాయి..?
పురాణాల ప్రకారం, ఓసారి రాధ.. జగన్నాథుని రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడిని చూడటానికి పూరీ వచ్చింది. అయితే.. ఆలయంలోకి… ఆయన భార్యలకు మాత్రమే ప్రవేశం ఉందని.. రాధను అక్కడి పూజారులు లోపలికి అనుమతించలేదట. దీంతో… పెళ్లికాని వారు జంటగా వస్తే.. వారు విడిపోతారు అని రాధ శాపం ఇచ్చిందని.. అక్కడి ప్రజలు నమ్ముతారు. దీనినే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు.
జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుకల్లో ఒకటి. ఈ యాత్రలో జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి శ్రీ గుండిచా ఆలయానికి రథాలపై ఊరేగింపుగా వెళ్తారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివస్తారు.