తులసి పూజా విధానం...
1.సోమవారం: సోమవారం రోజు తులసి మొక్కకు కొద్ది పచ్చి పాలు పోయడం వల్ల చంద్రుని అనుగ్రహం లభిస్తుంది. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలు తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ధన ప్రవాహం పెరుగుతుంది. ఇంట్లో సంపదకు లోటు ఉండదు.
2.గురువారం: గురవారం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు.ఈ రోజు తులసి కోట వద్ద పసుపు నీళ్లు పోయడం లేదా పసుపుతో పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు కూడా తొందరగా పూర్తి అవుతాయి.
3.శుక్రవారం: శుక్రవారం మహా లక్ష్మికి అంకితం. అందుకే.. ఈ రోజున తులసి మొక్కకి తేనె పోయడం వల్ల కుటుంబంలో కలహాలు తొలికి, భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. సంపద పెంచుకోవడానికి శుక్రవారం రోజున తులసి మొక్కకు చెరకు రసం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.