Spiritual: మహిమాన్వితమైన త్రిలింగ క్షేత్రాల మహిమ.. దర్శనంతోనే దరిద్రాలు దూరమవుతాయి!

First Published | Sep 13, 2023, 3:21 PM IST

 Spiritual: త్రిలింగ క్షేత్రాలు, పరమేశ్వరుడి యొక్క దివ్య క్షేత్రాలు. వీటిని దర్శించుకున్నంత మాత్రాన పాపాలు తొలగిపోయి, పరమేశ్వరుడి కృపకి పాత్రులు అవుతారని భక్తుల విశ్వాసం. అసలు త్రిలింగ క్షేత్రం అంటే ఏమిటి, దాని విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 

significance-of-trilinga-temples-in-telugu-states- gnr

 త్రిలింగ క్షేత్రాలు అని భక్తులు పిలుచుకునే మూడు పరమ పవిత్రమైన శైవ క్షేత్రాలు త్రిలింగ క్షేత్రాలు. అవే శ్రీశైల క్షేత్రం, కాళేశ్వర క్షేత్రం,  ద్రాక్షారామ క్షేత్రం. ఈ మూడు క్షేత్రాలను కలిపి త్రిలింగ క్షేత్రాలు అంటారు. త్రిలింగమే క్రమేణా తెలుగు గా మారిందని, అలాగే ఈ క్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ ప్రాంతమని కాలక్రమేణా అదే తెలంగాణగా మారినట్లు పెద్దలు చెబుతారు.
 

significance-of-trilinga-temples-in-telugu-states- gnr

 ముందుగా ద్రాక్షారామం భీమేశ్వర స్వామి యొక్క విశిష్టత తెలుసుకుందాము. ఇక్కడ లింగాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్టించాడని స్థల పురాణం చెప్తుంది. చంద్రుడి పేరు మీద ఇక్కడి స్వామివారిని సోమేశ్వర స్వామి అంటారు. ఈ ఆలయంలో అమావాస్యనాడు చంద్రుడు బూడిద లేదా గోధుమ రంగులోను, పౌర్ణమి నాడు తెలుపు రంగులోను దర్శనమిస్తారు.
 


సోమేశ్వర ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒకటి. అలాగే శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి విశిష్టత ఏమిటంటే పార్వతీదేవి యొక్క 18 శక్తి పీఠాలలో శ్రీశైలం ఒకటి. అలాగే శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాంటి విశిష్టత కలిగిన ఈ దేవాలయాన్ని శివుడికి ఇష్టమైన శ్రావణమాసంలో..
 

దర్శించుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నెలలో శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకుంటే పొలాలు సమృద్ధిగా ఉంటాయని, పాడి రైతులకు కూడా ప్రయోజనం ఉంటుందని చెబుతారు. ఇక త్రిలింగ క్షేత్రాలలో మూడవది శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం.
 

ఇది కరీంనగర్ కి 125 కిలోమీటర్ల దూరంలో మహాదేవపూర్ మండలానికి దగ్గరలో దట్టమైన అడవి మధ్యలో పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉంటుంది. గోదావరి నదికి ఉపనది అయిన ప్రాణహిత నది కలిసే చోట ఉంటుంది ఈ కాళేశ్వర క్షేత్రం. ఈ క్షేత్రం పేరు మీదగానే కాళేశ్వరం  ప్రాజెక్టు అని పేరు పెట్టారు. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏమిటంటే..ఈ ఆలయం యొక్క గర్భగుడిలో రెండు శివలింగాలు పూజలు అందుకుంటాయి.
 

 ఒకటి ముక్తేశ్వరుడిగా అంటే శివుడిగా, రెండవది కాలేశ్వరుడిగా అంటే యముడిగా.  ఇలా రెండు రూపాయలలోనూ ఇక్కడ పరమేశ్వరుడు పూజలు అందుకుంటాడు. ఇలా రెండు శివలింగాలు ఉండే ఆలయం భారతదేశంలో మరొక చోట కనిపించదు. ఈ త్రిలింగ క్షేత్రాలని దర్శించుకోవడం చేతనే పాపాలు నశిస్తాయి అని  భక్తుల విశ్వాసం.

Latest Videos

click me!