వినాయక చవితి 2023: ఇంట్లోకి వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే..!

First Published | Sep 12, 2023, 1:07 PM IST

Ganesh Chaturthi 2023: వినాయక చవితి సందర్భంగా ఇంట్లోకి వినాయకుడి విగ్రహాలను తీసుకొచ్చేటప్పుడు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఇంకొన్ని పనులను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అవేంటంటే..? 

Image: Our Own

Ganesh Chaturthi 2023: వినాయక చవితి పండుగను శివపార్వతుల కుమారుడైన వినాయకుడి జననాన్ని పురస్కరించుకునే జరుపుకుంటారు. భారతదేశంలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాగా ఈ సంవత్సరం సెప్టెంబర్ 19 న వినాయక చవితి పండుగను జరుపుకోబోతున్నాం. కాగా 10 రోజుల పాటు ఈ ఉత్సవాలు సెప్టెంబర్ 29న ముగుస్తుంది. ఈరోజే వినాయకుడి నిమజ్జనం ఉంటుంది. 
 

అయితే వినాయక చవితి సందర్భంగా ఇళ్లళ్లకు వినాయకుడి విగ్రహాలను కొని తీసుకొస్తుంటారు. ఈ సమయంలో కొన్ని పనులను తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


ఎకో ఫ్రెండ్లీ వినాయకుడి విగ్రహం

ఈ వినాయక చవితికి ఎకో ఫ్రెండ్లీ విఘ్నేషుడి విగ్రహాన్ని మాత్రమే కొనండి. ఈ విగ్రహాలను సహజ బంకమట్టి లేదా ఇతర బయోడిగ్రేడబుల్ పదార్థాలతోనే తయారు చేస్తారు. ఇవి పర్యావరణానికి ఎలాంటి హాని చేయవు. పండుగ ముగిసిన తర్వాత ఈ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అయితే ఈ విగ్రహాలు నీటిలో సులభంగా కరుగుతాయి. ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను కొనడం వల్ల నీటి కాలుష్యం జరగదు. పర్యావరణాన్ని కలుషితం చేసే హానికరమైన రసాయనాలు రిలీజ్ కావు. వీటితో నాన్ బయోడిగ్రేడబుల్ పదార్థాల వాడకాన్ని నిరోధించొచ్చు.

అలంకరణ

మీ ఇంటికి వినాయకుడిని తీసుకొస్తున్నట్టైతే మీ ఇంటిని పూలతో అలంకరించండి. అలాగే ధూపం, దీపాలతో అందంగా పూజా గదిని తయారుచేయండి.  ఈ అలంకరణలు వినాయకుడికి ఆనందింపజేస్తాయి. అలాగే పూజ, ఆచారాల సమయంలో ప్రశాంతతను అందించడానికి సహాయపడతాయి.
 

పూజ

వినాయకుడికి చిత్తశుద్ధితో పూజలు చేయండి. మంత్రాలను పఠించండి. పూజలు, మంత్రాలు దేవతలకు దగ్గర కావడమే కాకుండా వారి ఆశీర్వాదాలు కూడా మీకు దక్కుతాయి. వినాయక చవితి సందర్భంగా ఆయన భక్తులు "గణపతి బప్పా మోరియా", "ఓం గణపతాయే నమః" వంటి మంత్రాలను భక్తిశ్రద్ధలతో జపిస్తారు. వీటిని పఠిస్తే వినాయకుని ఆశీస్సులను పొందుతారు. అలాగే జీవితంలో సంతోషంగా ఉంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

వ్రతాలు

వినాయకుడికి పూజలు, వ్రతాలను మరువకుండా చేయండి. వినాయక చవితి సందర్భంగా వినాయకుడి ఆశీస్సులు పొందడానికి పువ్వులు మాత్రమే కాకుండా స్వీట్లు లేదా ఇతర ఆహార పదార్థాలను కూడా సమర్పిస్తారు. అలాగే పూజ సమయంలో వినాయకుడికి హారతి ఇవ్వాలి. దేవుడి ఆశీస్సులు పొందడానికి దీపాలు వెలిగించి వినాయకుడికి పూజ చేయాలి. 
 

చేయకూడని పనులు

1. వినాయకుడి విగ్రహాలను ఏ జలాశయంలో అంటే నది లేదా సముద్రంలో నిమజ్జనం చేయకూడదు. ఎందుకంటే ఇది గణేశుడిని అగౌరవ పరచడంగా భావిస్తారు.

2.  విఘ్నేషుడికి పూజ చేసేటప్పుడు లేదా ప్రార్థనలు చేసేటప్పుడు చుట్టు పక్కల ప్లాస్టిక్, కాగితం లేదా పూల రేకులు వంటి వ్యర్థ పదార్థాల చెత్తను వేయకూడదు. 

3. అలాగే పండుగ సమయంలో సంగీతం లేదా లౌడ్ స్పీకర్లను పెద్దగా ఉపయోగించకుండా ఉండాలి. ఎందుకంటే ఇది మీచుట్టుపక్కల నివసించే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది. లేదా అనవసరమైన శబ్ద కాలుష్యానికి కారణమవుతుంది.

Latest Videos

click me!