సాధారణంగా అమావాస్య రోజు సూర్య గ్రహణం, పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. అమావాస్యరోజు సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా రావడం వల్ల మనకు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇక ఈ సూర్యగ్రహణం శనివారం అమావాస్య రోజున ఏర్పడటంవల్ల అమావాస్యను శని అమావాస్య అని కూడా పిలుస్తారు. శని అమావాస్య రోజు గ్రహణం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారిపై శని గ్రహ ప్రభావం ఏర్పడనుంది.
అదే విధంగా శని అమావాస్య కావడంతో ఈరోజు కొన్ని దానా ధర్మాలను చేయడం వల్ల ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న శనిదోషం తొలగిపోతుంది. ఈ విధంగా దానధర్మాలు నదీ స్నానాల ప్రత్యేక పూజలు చేయడం మంచి ఫలితాలనిస్తుంది.
ఇకపోతే 30వ తేదీ సూర్య గ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది? గ్రహణం ఏ ఏ దేశాలలో కనిపించనుంది అనే విషయాలకు వస్తే.. ఈ ఏడాది ఏర్పడిన తొలి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు అట్లాంటిక్, ఆర్కిటిక్, దక్షిణ అమెరికాలోని నైరుతి భాగం పసిఫిక్ మహాసముద్రం వంటి ప్రదేశాలలో సూర్యగ్రహణం కనిపించనుంది.
ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం12:15 నిమిషాలకు ప్రారంభమయ్యే మరుసటి రోజు ఉదయం 04:07 గంటలకు ముగుస్తుంది. ఇక ఈ గ్రహణ ప్రభావం ఏ రాశుల వారిపై పడనుంది అనే విషయానికి వస్తే...
మేష రాశి: మేష రాశి వారిపై శని గ్రహ ప్రభావం అధికంగా ఉంది.కనుక మేష రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.ఈ సమయంలో మీ పై మీ శత్రువులు ఆధిపత్యం చెలాయించటానికి ప్రయత్నిస్తారు. కనుక ఎంతో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ రాశివారు సూర్య గ్రహణ సమయంలో ప్రయాణం చేయడం మంచిది కాదు.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి కనుక గ్రహణ సమయంలో చంద్రుడు రాహువుతో కలిసి మేష రాశిలో ఉంటాడు.ఇలా ఉండటం వల్ల మానసిక ఆందోళనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాలి, ఈ రాశి వారికి ఎంతో సహనంతో ఉండటం మంచిది.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారు గ్రహణ సమయంలో తమ గౌరవాన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. కనుక గ్రహణ సమయంలో మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయడం ఎంతో మంచిది. ముఖ్యంగా శత్రువుల నుంచి ఎలాంటి ఆపదలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.