Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే సరైన సమయం ఇదే!

First Published | Apr 27, 2022, 3:30 PM IST

మామూలుగా అక్షయ తృతీయ అనగానే అందరికీ గుర్తొచ్చేది పసిడి. ఆ రోజున కొన్న పసిడి అయినా లేదా విలువైన వస్తువులు అయినా మరింత అక్షయం అవుతుందని నమ్మకం. 
 

అందుకే అక్షయ తృతీయ రోజు విలువైన వస్తువులు లేదా బంగారం, వెండి వంటివి కొంటూ ఉంటారు. మరి ఎప్పుడూ లేని విధంగా అక్షయ తృతీయ రోజే ఇవి ఎందుకు కొనుగోలు చేయాలి అనుకుంటారు. అసలు దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి అనుకుంటున్నారా. అయితే ఇక్కడ చూడండి..
 

ఓసారి శివుడు పార్వతి దేవికి అక్షయ తృతీయ వ్రతం గురించి వివరిస్తాడు. వైశాఖ మాసం శుద్ద తదియ నాడు ఏ వ్రతం చేసినా ఏ పూజలు చేసిన పుణ్యాలు దక్కుతాయి. అంతేకాకుండా ఆరోజు మంచి వస్తువు కూడా సొంతం చేసుకున్న అది కూడా అక్షయం అవుతుంది. పుణ్య కార్యాచరణ వల్లే కాకుండా పాప కార్యచరణ వల్ల కూడా అక్షయమౌతుంది.
 


ఆరోజు బ్రహ్మతో తృతీయ తిథి కలిసి ఉండడం వల్ల అది మంచి రోజుగా పూజింపబడుతుంది. ఈ అక్షయ తృతీయ రోజు అక్షయుడైన విష్ణువును పూజించడం వల్ల అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. ఆ రోజున విష్ణువుకు పూజలు, ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే కూడా మంచి జరుగుతుంది. ఆ రోజు ఎటువంటి దానం చేసినా కూడా అది కూడా అక్షయమవుతుంది.
 

శ్రీకృష్ణుడు కూడా ద్రౌపదికి అక్షయపాత్రను అక్షయ తృతీయ నాడు సమర్పించాడు. దాంతో ఆయన మరింత సంపన్నుడు అయ్యాడు. అలా ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజు ప్రజలు విలువైన వస్తువులను, బంగారం వంటి వాటిని కొనుగోలు చేస్తారు. ఇక ఈ సారి మే 3న అక్షయ తృతీయ వస్తుంది.
 

ఇక ఆ రోజు పొందిన పుణ్యాలు, ఐశ్వర్యాలు ఎప్పటికీ తరగవని ఒక నమ్మకం ఉంది. బ్రహ్మ దేవుని కుమారుడు అక్షయ కుమారుడు ఆరోజునే జన్మించాడు. దాంతో వైశాఖ శుక్ల తృతీయ తేదీని అక్షయ తృతీయ అని అంటారు. ఇక ఆ రోజున కొన్న బంగారం, వెండి, విలువైన వస్తువులకు పూజలు చేస్తారు. అలా చేయడం వల్ల మరింత అభివృద్ధి చెందుతుంది అని నమ్మకం.
 

ఇక అసలు విషయానికి వస్తే.. ఆ రోజు బంగారం ఏ సమయానికి కొనుగోలు చేస్తే మంచిదో తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ తేదీ మే 3న రావడంతో ఆరోజు ఉదయం 05:18 నిమిషాల నుంచి ప్రారంభమవ్వగా ఇక మరుసటి రోజు అనగా మే 4 ఉదయం 7.32 వరకు ఉంటుంది. ఇక ఆ సమయంలో విలువైన వస్తువులతో పాటు బంగారం, వెండి ఇతర వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
 

ముఖ్యంగా వీటిని కొనుగోలు చేసే స్థోమత లేని వాళ్ళు.. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు కి ఇష్టమైన పదార్థాలతో పూజలు చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుంది. అంతేకాకుండా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కూడా చేరువవుతాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేయని వారు కూడా ఇలా చేసి పుణ్యం సంపాదించుకోవచ్చు.

Latest Videos

click me!