Akshaya Tritiya 2022: లక్ష్మీ కటాక్షం పొందాలంటే కోసం అక్షయ తృతీయ నాడు గవ్వలు కొని ఇలా చెయ్యాల్సిందే!

First Published | Apr 27, 2022, 2:45 PM IST

ఎందుకంటే ఆ రోజున ఏ వస్తువు కొన్న అక్షయ మవుతుందని నమ్మకం. దీంతో ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజు డబ్బులు లేని వాళ్లు కూడా అప్పు చేసి మరి బంగారం, విలువైన వస్తువులు వంటివి కొనుగోలు చేస్తారు. పైగా ఆరోజు బంగారం ఏ రేటు లో ఉన్నా కూడా ప్రజలు కొనడానికి వెనుకాడరు. ఎందుకంటే దానివల్ల మరింత అక్షయం అవుతుందని నమ్మకం.
 

ఎందుకంటే ఆ రోజున ఏ వస్తువు కొన్న అక్షయ మవుతుందని నమ్మకం. దీంతో ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజు డబ్బులు లేని వాళ్లు కూడా అప్పు చేసి మరి బంగారం, విలువైన వస్తువులు వంటివి కొనుగోలు చేస్తారు. పైగా ఆరోజు బంగారం ఏ రేటు లో ఉన్నా కూడా ప్రజలు కొనడానికి వెనుకాడరు. ఎందుకంటే దానివల్ల మరింత అక్షయం అవుతుందని నమ్మకం.
 

ఈ రోజున హిందువులు శ్రీమహావిష్ణువుకు పూజలు చేసి పుణ్యాలు సంపాదించుకుంటారు. అంతేకాకుండా ఏదైనా మంచి పని చేపట్టడానికి ఈ శుభ సమయంను ఎంచుకుంటారు. కేవలం శుభకార్యాలకే కాకుండా కొనుగోలకు కూడా మంచి రోజుగా భావిస్తుంటారు. ఇక ఈ రోజున కేవలం బంగారమే కాకుండా ఇతర వస్తువులను కొనుగోలు చేసిన కూడా మంచి ఫలితం ఉంటుంది.
 


ఆరోజున ధాన్యం, జొన్నలు వంటివి కొనుగోలు చేసి విష్ణువుకి సమర్పించి ఆ తరువాత వాటిని ఓ ఎర్రటి వస్త్రంలో చుట్టి వాటిని భద్రపరచాలి. అలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీకటాక్షం కలుగుతుంది. అంతేకాకుండా ధాన్యం కూడా వృద్ధి అవుతుంది. ఇక లక్ష్మీదేవికి గవ్వలు అంటే కూడా చాలా ఇష్టం. అక్షయ తృతీయ రోజు గవ్వలు కొని లక్ష్మీ దేవి పాదాల సమర్పిస్తే అంతా మంచి జరుగుతుంది.
 

పైగా అమ్మవారికి ఆచార వ్యవహారాల ప్రకారం పూజలు చేసి మరుసటి రోజు ఆ గవ్వలని ఎర్రని వస్త్రంలో చుట్టి ఇంట్లో పవిత్రమైన చోట భద్రపరచాలి. దానివల్ల లక్ష్మీ కటాక్షం త్వరగా పొందవచ్చు. అదే రోజు శ్రీ యంత్రం కొనుగోలు చేసి పూజలు చేసి ఇంట్లో ప్రతిష్టించడం వల్ల చాలా లాభాలు వస్తాయి. ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన శంఖం కూడా కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకున్నట్లయితే సుఖశాంతులు చేరువవుతాయి.
 

అలా అక్షయ తృతీయ రోజు బంగారంతో పాటు వీటిని కూడా కొనుగోలు చేసి చెప్పిన విధంగా భద్రపరిస్తే ఎటువంటి నష్టాలు ఉండవు. ముఖ్యంగా బంగారం వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేసే స్తోమత లేని వాళ్ళు శ్రీ మహా విష్ణువు కి పూజలు చేసి ఆయనకి ఇష్టమైనవి సమర్పించి పుణ్యం పొందవచ్చు.
 

అంతేకాకుండా సులభంగా దొరికే గవ్వలతో, ధాన్యం, జొన్నలతో చెప్పిన విధంగా చేసినట్లయితే మంచి ఫలితం అందుతుంది. ఇక ఆ రోజున శ్రీ మహావిష్ణువు తో పాటు లక్ష్మీదేవికి పూజ చేసినట్లయితే ఆయురారోగ్యాలతో పాటు ఆ కుటుంబంలో సుఖశాంతులు కూడా ఎన్నటికీ చెరగవు. ఇక ఈ సారి మే 3న అక్షయ తృతీయ వస్తుంది.

Latest Videos

click me!