రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లి రామ రావణ యుద్ధానికి కారణమయ్యాడు. కానీ నిజానికి రావణుడు బ్రాహ్మణోత్తముడు, బలవంతుడు, గొప్ప తపస్సాలి. సనక సమందాది ఋషుల శాపం వలన వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులే త్రేతా యుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించారని పురాణం చెప్తుంది.
అయితే రావణుడికి పది తలలు ఎందుకు ఉన్నాయి అనే దానిపై పలు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక పురాణ కథ ప్రకారం విష్ణుమూర్తి నరసింహ అవతారంలో తనను సంహరించే సమయంలో అకస్మాత్తుగా పుట్టి, 20 గోళ్ళతో నన్ను ఒక్కడిని చంపటం కూడా ఒక పౌరుషమైన అంటూ హిరణ్యకశిపుడు చులకనగా మాట్లాడుతాడు.
దానికి శ్రీహరి తదుపరి జన్మలో నీకు 10 తలలు 20 చేతులు ప్రసాదించి, నేను మానవుడిగా అవతరించి నిన్ను సంహరిస్తాను అని చెప్పాడంట. అందుకే శ్రీరాముడిగా పుట్టిన విష్ణుమూర్తి రావణాసురుడిగా పుట్టిన హిరణ్యకశిపుడిని మానవ అవతారంలో చంపుతాడు.
మరొక కథనం ప్రకారం రావణుడికి కామరూప విద్యతో పది తలలు ఏర్పడ్డాయని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అతను కోరుకున్నప్పుడు పది తలలు 20 చేతులు వస్తాయి. నిజానికి రావణాసురుడు అపారమైన పరిపాలన దక్షత కలిగిన శివ భక్తుడు. కానీ స్త్రీ వ్యామోహం అతనిని అధోగతి పాలు చేసింది.
అయితే విచిత్ర రామాయణం మాత్రం మరో విధంగా చెప్తుంది. విశ్రవసు భార్య కైకసి దాంపత్య సుఖాన్ని కోరి ఆయనను చేరుకుందట. అయితే ఆమె అప్పటికే 11 సార్లు రుతుమతి అయినట్లుగా విశ్రవసు తెలుసుకుంటాడు. కాబట్టి 11 మంది పుత్రులని పొందాలని భావిస్తాడు.
కానీ కైకసి తనకి ఇద్దరు పుత్రులు మాత్రమే కావాలంటుంది. ఈ క్రమంలోనే తపోనిది అయిన విశ్రవసు తన మాట మరియు తన భార్య కైకసి మాట ఇద్దరి కాంక్ష వృధా కాకుండా 10 తలలు ఉన్న రావణుడిని 11వ వాడిగా కుంభకర్ణుడిని ఇచ్చాడని విచిత్ర రామాయణం కథ చెప్తుంది .