Spiritual: గోమాతకు వీటిని ఆహారంగా పెట్టడం వలన.. ఎలాంటి ఫలితాలు వస్తాయంటే!

First Published | Oct 3, 2023, 1:26 PM IST

 Spiritual:  హిందూ సంప్రదాయంలో గోవుకి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. గోవుని  మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము. అటువంటి గోవుకి ఎటువంటి ఆహారం పెడితే ఎలాంటి ఫలితం వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
 

హిందువులకి గోవులతో ఉన్న అవినాభావ సంబంధం ఎంతో గొప్పది. గోవుని భగవంతుని స్వరూపంగా భావించి దానికి పూజలు కూడా చేస్తాము. అయితే ఈ గోవులకి కొన్ని ఆహార పదార్థాలని తినిపించడం వలన చాలా మంచి జరుగుతుంది అని చెప్తున్నారు పండితులు అవేమిటో ఇప్పుడు చూద్దాం.
 

 గోమాతకి నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. అలాగే ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకి దోసకాయలను ఆహారంగా పెట్టండి. దీనివలన శత్రు నివారణ జరుగుతుంది. బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించండం వలన రుణవిముక్తి చెందుతారు.
 


 అలాగే నిత్యం కుటుంబ సభ్యులకు గొడవలు పడుతూ ఉండేవారు నానబెట్టిన పచ్చిశనగలను గోవులకి తినిపించడం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే పిల్లలు విద్యారంగంలో ఎదగాలని కోరుకునే తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పుని తినిపించాల్సి ఉంటుంది.

 అలాగే గోమాతకి నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అలాగే ఉద్యోగం రాకుండా ఉన్నవారు, ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న వారు గోమాతకి గోధుమపిండి, బెల్లము కలిపి పెట్టడం వలన మంచి ఫలితం వస్తుంది.అలాగే వివాహం కాని వారు గోమాతకి టమాటాలను తినిపిస్తే  మంచి ఫలితం వస్తుంది.

త్వరలోనే వివాహం కుదురుతుంది. అలాగే గోమాత కి నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. అలాగే గోమాతకి బీట్రూట్, పాలకూర తినిపించిన ధనవంతులవుతారు. అలాగే నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నానబెట్టిన బొబ్బట్లు గోమాతకు పెట్టడం వలన ధనాభివృద్ధి కలుగుతుంది అలాగే నానబెట్టిన ఉలవలు ఆహారంగా పెడితే..

 వృత్తిలో నిలకడ లభించి సమాజంలో మంచి పేరు వస్తుంది. అలాగే కొంచెం నీటిలో కలిపిన బియ్యం పిండిని గోమాతకు తినిపిస్తే ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉంటాయి. అలాగే నానబెట్టిన కందులని తినిపించడం వలన కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తులకు కోపం తగ్గి ప్రశాంతంగా మెలుగుతారు.

Latest Videos

click me!