మీ చేతుల్లో నుంచి ఈ వస్తువులు కిందపడటం అశుభం..

First Published | Oct 3, 2023, 2:53 PM IST

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. కొన్ని వస్తువులు మన చేతులో నుంచి కింద పడటం అస్సలు మంచి శకునం కాదు. ఇది మీ జీవితంలో జరగబోయే చెడు సంఘటనలను తెలియజేస్తుందట. 
 

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని వస్తువులను చేతుల్లో నుంచి కింద పడేయడం అశుభం. మనం ఇవి కావాలని చేయకపోయినా ఇవి మీకు ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని వస్తువులు చేతిలోంచి కింద జారిపడటం అంటే మీ జీవితంలో ఏదో సమస్యను ఎదుర్కోబోతున్నారనే అర్థం వస్తుంది. అంటే ఉద్యోగాన్ని కోల్పోవడం, ఫెయిల్యూర్, ఆర్థిక నష్టం వంటివి సంభవించే అవకాశం ఉండటాన్ని సూచిస్తుంది. మరి మన చేతుల్లోంచి ఎలాంటి వస్తువులు కింద పడటం అశుభమో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఉప్పు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఉప్పు శుక్ర గ్రహంతో సంబంధం కలిగుంటుంది. అందుకే దీన్ని మీ చేతుల్లోంచి పదేపదే కింద పడటం అశుభంగా పరిగణిస్తారు. మీ చేతుల్లోంచి పదే పదే ఉప్పు జారి కిందపడితే శుక్రుడు, చంద్రుడు బలహీనంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఉప్పు కిందపడితే మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. కొట్లాటలు, గొడవలు జరగొచ్చు. అంతేకాదు ఉప్పు చేయి నుంచి జారి నేలమీదపడితే మీకు జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. 


నూనె

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. చేతుల్లోంచి నూనె కూడా జారి కిందపడకూడదు. దీన్ని కూడా అశుభంగా భావిస్తారు. మీ చేతుల్లోంచి నూనె జారి పడితే మీ జీవితంలో ఏదో పెద్ద సమస్య రాబోతున్నట్టేనంటున్నారు జ్యోతిష్యులు. అంతేకాదు మీరు ఫ్యూచర్ లో ఆర్థిక సమస్యను కూడా ఎదుర్కోబోతారు. అప్పులు చేసే అవకాశం కూడా ఉంది. అంతేకాదు  ఎంతచేసిన చేసిన అప్పులను తీర్చలేకపోవచ్చు. 
 

పూజా ప్లేట్

వాస్తుశాస్త్రం ప్రకారం.. పూజా ప్లేట్ కింద పడటం కూడా అశుభమే.  మీ చేతిలోంచి పూజా ప్లేటు కింద పడితే దేవుడు మీపై కోపంగా ఉన్నాడని అర్థం. అంతేకాదు మీరు జీవితంలో పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇది సూచిస్తుంది.

Image: Getty

పాలు

చేతుల నుంచి పాలు కిందపడటం కూడా మంచిది కాదు. మీ చేతి నుంచి పదేపదే పాలు కింద పడితే మీ బిడ్డకు ఏదో సమస్య రాబోతుందని అర్థం. అలాగే ఇది మీ ఇంట్లో వచ్చే సమస్యలను కూడా సూచిస్తుంది. 
 

బియ్యం

బియ్యాన్ని కూడా పూజలో వాడుతారు. అందుకే వీటిని పవిత్రంగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితిలో బియ్యం లేదా అన్నం గిన్నే మీ చేతిలో నుంచి పడిపోతే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోబోతున్నారని అర్థం చేసుకోండి.

Latest Videos

click me!