మహారాష్ట్రలోని సాంగ్లీలో ఖచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే!

First Published | Jan 20, 2022, 1:29 PM IST

మహారాష్ట్ర (Maharashtra) రాష్ట్రంలోని సాంగ్లీ (Sangli) జిల్లాలో అనేక సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. వీటి సందర్శన పర్యాటకులకు తప్పక నచ్చుతుంది. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటూ పర్యాటకులను ఆకర్షించేలా ఉంటుంది. ఇప్పుడు మనం మహారాష్ట్రలోని సాంగ్లీలో సందర్శనకు వీలుగా ఉన్న కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
 

సాంగ్లీలో గణపతి ఆలయం, బాహుబలి హిల్ టెంపుల్, మీరజ్ దర్గా, సాంగ్లీ కోట, సాగరేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చువరీ, దండోబా హిల్ స్టేషన్, మారుతి రోడ్ (Maruti Road), కృష్ణ వ్యాలీ వైన్ పార్క్ (Krishna Valley Wine Park) ఇలా మొదలగునవి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఈ ప్రదేశాల సందర్శన పర్యాటకులకు తప్పక నచ్చుతుంది.
 

గణపతి ఆలయం: సాంగ్లీ జిల్లాలో ప్రధాన ఆకర్షణ ఆలయంగా గణపతి ఆలయం (Ganapati Temple) ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దైవంగా వినాయకుడిని పూజిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి భారతదేశంలోని నలుమూలల నుండి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడి అందమైన వాతావరణం, అద్భుతమైన శిల్ప కళలు (Sculptural arts), నల్ల రాతి గోడలు పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయి.
 

Latest Videos


మీరజ్ దర్గా: మీరజ్ దర్గా (Miraj Dargah) సాంగ్లీకి అతి సమీపంలో ఉంది. సుమారు 500 సంవత్సరాల క్రితం ఈ దర్గాను కట్టించారు. ఇక్కడ ప్రతి ఏటా సంగీత వేడుకలు (Music celebrations) జరుగుతాయి. ఈ వేడుకలను సందర్శించడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ దర్గాను అన్ని మతాల వారు సందర్శిస్తారు.
 

బాహుబలి హిల్ టెంపుల్: సాంగ్లీ నుంచి సుమారు గంటలోపు ప్రయాణంలో బాహుబలి హిల్ టెంపుల్ (Bahubali Hill Temple) ను చేరుకోవచ్చు. ఈ ఆలయంలో బాహుబలి విగ్రహం 28 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ప్రదేశంలో 24 మంది తీర్థంకరులు ఉంటారు. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటూ ఆధ్యాత్మికతను (Spirituality) రంగరిస్తుంది.
 

సాంగ్లీ కోట: సాంగ్లీ కోట (Sangli Fort) సాంగ్లీ పట్టణానికి మధ్య భాగంలో ఉంది. ఈ కోటకు సమీపంలో అప్పటి రాజు వాడే ప్యాలెస్, మ్యూజియం (Museum) ఉన్నాయి. ఇప్పుడు ఈ కోటను కలెక్టర్ కార్యాలయంగా వాడుతున్నారు. ఈ కోట నిర్మాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఆనాటి శిల్పకళలను, చారిత్రాత్మక నిర్మాణాన్ని తెలియజేస్తోంది.
 

సాగరేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చువరీ: భారతదేశంలో కృత్రిమంగా తయారు చేయబడిన ప్రధాన ఆకర్షణ అడవిగా సాగరేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చువరీ (Sagareshwara Wildlife Sanctuary) ప్రసిద్ధి. ఈ కృతిమ అడవి (Artificial jungle) సాంగ్లీ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అడవి సందర్శనలో చిరుత, జింక, నీటి జీవులు, అడవి పక్షులు ఇలా ఎన్నో ప్రాణులను చూడవచ్చు.
 

దండోరా హిల్ స్టేషన్: సాంగ్లీ నుంచి సుమారు అరగంట దూర ప్రయాణంలో దండోరా హిల్ స్టేషన్ (Dandora Hill Station) ఉంది. ఇక్కడి కొండమీద అడవి సంరక్షణ ప్రదేశం ఉంది. ఈ హిల్ స్టేషన్ సందర్శన పర్యాటక ప్రియులకు తప్పక నచ్చుతుంది. ఈ హిల్ స్టేషన్ లో అనేక ఆలయాలు, చారిత్రక చిహ్నాలు (Historical symbols) కూడా ఉన్నాయి.

click me!